కమాన్ పూర్ లో పౌర హక్కుల దినోత్సవం

మంథని, (జనంసాక్షి) : పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రం ఎస్సీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని తహసిల్దార్ వాసంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రెండు గ్లాసుల పద్ధతి దళితులకు ఆలయాల ప్రవేశం పై ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, ఏఎస్ ఐ బాలాజీ, ఆర్ఐ స్రవంతి, ఉప సర్పంచ్ రఫిక్ సోహెల్, వార్డు సభ్యులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.



