కాంగ్రెస్ నాయకుల్లారా.. జర జాగ్రత్త..!
మంథని, (జనంసాక్షి) : అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా జర జాగ్రత్తగా ఉండండి. .!, అధిష్టానానికి దగ్గరగా ఉన్న, దగ్గరవుతున్న నాయకులను, నమ్మకస్తులను వారి నుంచి దూరం చేయడమే లక్ష్యంగా మంథని డివిజన్ లోని ఓ మండలంలో మండల స్థాయి నాయకుడు పావులు కదులుతున్న వైనం సంచలనగా మారింది. ఇటీవల అధిష్టానం ఒక కార్యక్రమం గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సమాచారం అందించాలని ఆ మండల స్థాయి నాయకుడికి చెప్పినప్పటికిని, కావాలనే దురుద్దేశంతో ఈ సమాచారాన్ని కొంతమంది ముఖ్య నాయకులకు తెలుపలేదు. దీని పర్యవసానంగా ఆ మండలంలో సూర్య, చంద్రులుగా పిలువబడుతున్న ముఖ్య నాయకులకు తాజాగా ఒకరికి ఫోన్ ద్వారా.. మరొకరికి నేరుగా ప్రజల మధ్యనే అధిష్టానం నుంచి అక్షింతలు పడటం చర్చనీయాంశంగా మారింది. తాను ఒక్కడే అధిష్టానానికి నమ్మున బంటుగా చలామణి కావాలనే దురుద్దేశం, కుట్రతో తో సదరు మండల స్థాయి నాయకుడు.. ఇతర మండల స్థాయి నాయకులను, నమ్మకస్తులను అధిష్టానం దగ్గర బ్లేమ్ చేసి వారిని దూరం చేయడమే లక్ష్యంగా కుట్రలు పన్నుతూ. .పావులు కదుపుతూ అధిష్టానాన్ని సైతం తప్పుదారి పట్టిస్తుండడం కలకలం రేపుతున్నది. ఇప్పటికైనా ఆ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అధిష్టాన ముఖ్య నేతలు సైతం సదరు మండల స్థాయి నాయకుడిని గుడ్డిగా నమ్మకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.