మగ్దుంపురం గ్రామ శివారులో మొసలి ప్రత్యక్షం

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

చెన్నారావుపేట, డిసెంబర్ 27 (జనం సాక్షి):

పాకాల సరస్సులో వదిలిన ఫారెస్ట్ అధికారులు…

మగ్దుం పురం గ్రామ శివారులోని పంట కాలువలో శుక్రవారం మొసలి ప్రత్యక్షమైంది. అటువైపుగా వెళ్లిన కొందరు రైతులు గమనించి మొసలిని పట్టుకొని గ్రామంలోకి తీసుకువచ్చారు. వెంటనే స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. నర్సంపేట ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యోగిలు గ్రామానికి చేరుకొని మొసలిని పట్టుకొని వెళ్లి ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో వదిలారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్న, బేస్ క్యాంప్ చందు, డ్రైవర్ శివ, తదితరులు పాల్గొన్నారు.