దంతూరు గ్రామ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

 

 

 

 

 

 

 

భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 23 (జనం సాక్షి): మండల పరిధిలోని దంతూరు గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గోరుగంటి సువర్ణ రవీందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు ఉప సర్పంచ్ బింగి పూజ, వార్డు సభ్యులు కూడా అధికారికంగా తమ విధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్, నాయకులు మన్నే వెంకటరెడ్డి పాల్గొని నూతన పాలకవర్గానికి అభినందనలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని నూతన సర్పంచ్ తెలిపారు.