భారీ కణతిని తొలగించిన ఆర్మూర్ రీషిత్ హాస్పిటల్ వైద్యులు

ఆర్మూర్, నవంబర్ 18 ( జనం సాక్షి): ఆర్మూర్ పట్టణంలోని రీషిత్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వెంకట్ గౌడ్.. రోగి కడుపులో నుండి సుమారు 5 కేజీల అతి పెద్ద కణతిని తొలగించి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజవ్వ (65) తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ రీషిత్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. హాస్పిటల్ వైద్యులు పూర్తి పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ కారకాలు లేవని కణతిగా గుర్తించి సుమారు గంటపాటు శ్రమించి బరువైన కణతిని తొలగించారు.రోగి వయసు పైబడి ఉండడంతో మరింత కష్టంగా మారిన శస్త్ర చికిత్సను చేసి కణతిని తొలగించి ప్రాణాలతో కాపాడగలిగారు.అతి భారీ కణతిని తొలగించిన ఆర్మూర్ రీషిత్ హాస్పిటల్ వైద్యులు వెంకట్ గౌడ్ కు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.శాస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడడంలో పూర్తిగా విజయవంతమైన డాక్టర్ కు పలువురు అభినందనలు తెలిపారు.