ఉపరాష్ట్ర రాజీనామాపై అనుమానాలు
` ధన్‌ఖడ్ అనూహ్య నిర్ణయంపై ఏవో లోతైన కారణాలుండొచ్చు: కాంగ్రెస్
` కేంద్రం పూర్తి క్లారిటీ ఇవ్వాలి..ఆప్ డిమాండ్
న్యూఢల్లీి(జనంసాక్షి):ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణలు చేస్తున్నారు. ఇంత సడన్‌గా ఎందుకు రాజీనామా నిర్ణయం తీసుకున్నారని ఆరా తీస్తున్నారు. ధన్‌ఖడ్ అనూహ్య రాజీనామాపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. అనారోగ్య కారణాలతో వైదొలుగుతున్నట్లు ఆయన చెప్పినప్పటికీ.. అది కారణం కాకపోవచ్చని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. ’ధన్‌ఖడ్ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షత వహించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిరణ్ రిజిజుతో సహా పలువురు దీనికి హాజరయ్యారు. చర్చ అనంతరం సాయంత్రం 4.30కు మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అయితే, మరోసారి భేటీకి రిజిజు, నడ్డా రాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ధన్‌ఖఢ్ మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. దీన్ని బట్టి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4.30 మధ్య ఏదో పెద్ద విషయమే జరిగిందని జైరామ్ రమేశ్ అనుమానం వ్యక్తం చేశారు. రిజిజు, నడ్డా ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈక్రమంలోనే ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్‌ఖఢ్ ప్రకటించారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇలా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దాన్ని మనం గౌరవించాలి. కానీ, అందుకు చాలా లోతైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోందని రమేశ్ రాసుకొచ్చారు. తన పదవీకాలంలో రైతుల సంక్షేమంపై ధన్‌ఖఢ్ నిర్భయంగా మాట్లాడేవారని రమేశ్ పేర్కొన్నారు. ప్రజాజీవితంలో న్యాయపరమైన జవాబుదారీతనం, సంయమనం గురించి గట్టిగా మాట్లాడారన్నారు. ఆయన నిబంధనలు, ప్రొటోకాల్‌కు కట్టుబడి ఉన్నారన్నారు. సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. తొలి రోజు కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ధన్‌ఖఢ్ రాత్రి అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపారు. అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అందులో పేర్కొన్నారు. 2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్‌ఖడ్‌కు 2027 ఆగస్టు వరకూ పదవీకాలం ఉంది. ఈ క్రమంలోనే ఆయన వైదొలగాలని నిర్ణయించుకోవడం అనుమానాలను కలిగిస్తోంది. ధన్‌ఖఢ్ రాజీనామాతో రాజ్యసభ సమావేశాలను ప్రస్తుతానికి డిప్యూటీ- ఛైర్మన్‌గా ఉన్న జేడీయూ నేత హరివంశ్ నడిపించనున్నారు.ఉదయం నుంచి ఎగువసభను సజావుగా నడిపించిన ఆయన రాత్రికి తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపారు. దీంతో ఆయన రాజీనామాపై ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తోంది. అనారోగ్య కారణాలతో పదవి నుంచి దిగిపోతున్నట్లు- ధన్‌ఖడ్ చెప్పినప్పటికీ.. ఆయన రాజీనామాపై ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆరోగ్య కారణాలతోనే పదవి నుంచి దిగిపోతున్నట్లు- చెప్పారని.. దాన్ని మనం గౌరవించాలని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఆయన రాజీనామా వెనుక ఏదో లోతైన కారణమే ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ఉపరాష్ట్రపతి ‘అనూహ్య రాజీనామా’పై కేంద్రం క్లారిటీ ఇవ్వాలి: ఆప్ డిమాండ్
ఇంకా దాదాపు రెండేళ్లకు పైగా పదవీ కాలం ఉండగానే ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్(%జీaస్త్రసవవజూ ణష్ట్రaఅసష్ట్రaతీ%) రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అనారోగ్య కారణాలతోనే తాను రాజీనామా చేసినట్లుగా ఆయన పేర్కొన్నప్పటికీ విపక్షాలు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉపరాష్ట్రపతి అకస్మాత్తుగా రాజీనామా చేయడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆప్ డిమాండ్ చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశంగా పేర్కొంది. ఈ మేరకు ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ మౌనం, ప్రధాని నరేంద్ర మోదీ ఆలస్యంగా స్పందించడంపై పలు సందేహాలు లేవనెత్తారు. ‘‘రాజీనామా చేసిన తర్వాత చాలా సేపటికి ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’లో పోస్టు పెట్టడం అంతా చూశాం. ఈ జాప్యం ధన్‌ఖడ్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఒప్పించే ప్రయత్నం జరగలేదని సూచిస్తోంది. ఇంత ఉన్నతమైన రాజ్యాంగ పదవి నుంచి అకస్మాత్తుగా వైదొలగడం సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది’’ అని సంజయ్ సింగ్ అన్నారు. వైద్య పరమైన కారణాలను పేర్కొంటూ ధన్‌ఖడ్ తన ఉప రాష్ట్రపతి పదవికి సోమవారం రాత్రి రాజీనామా చేయడంపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.
‘‘ఉపరాష్ట్రపతి ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేయడం బాధాకరం. అయితే వర్షాకాల సమావేశాల మొదటి రోజు ఆయన రాజీనామా చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. ఈ ప్రభుత్వంలో ఏమి జరుగుతోంది? రాజీమానాకు ఆరోగ్యమే కారణం అయితే వర్షాకాల సమావేశానికి కొన్ని రోజుల ముందు లేదా తర్వాత రాజీనామా ఇవ్వవచ్చు’’ అని శివసేన (యూటీబీ) నాయకుడు ఆనంద్ దూబే అన్నారు.‘‘ఈ పరిణామం పూర్తిగా ఊహించనిది. భారత రాష్ట్రపతి దీనిని అంగీకరిస్తారని నేను అనుకోను. కొన్ని పరిణామాల పట్ల ఆయన అసంతృప్తిగా ఉండవచ్చు’’ అని సీపీఐ ఎంపీ పి.సంతోష్ కుమార్ అన్నారు.
నాకు వ్యక్తిగతంగా నచ్చలేదు: సిబల్
రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ధన్‌ఖడ్?ను దేశభక్తుడిగా అభివర్ణించారు. రాజీనామా చేయడానికి ధన్‌ఖడ్ ఆరోగ్య కారణాలను చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. ఆరోగ్య కారణాలు నిజమైతే కచ్చితంగా దాన్ని ఆమోదించి ముందుకు సాగాలని, దీనిపై తదుపరి చర్చ ఉండకూడదన్నారు. అయితే ఆయన రాజీనామాతో తాను వ్యక్తిగతంగా సంతోషంగా లేనన్నారు. ఎందుకంటే ఇప్పుడు తాను పార్లమెంటుకు వెళ్ళినప్పుడు ఆయన్ను కలవలేను అన్నారు. వ్యక్తిగతంగా ఆయన రాజీనామా నచ్చలేదని చెప్పుకొచ్చారు. ‘నాకు ఆయనతో చాలా మంచి సంబంధం ఉంది. ఆయన తన అభిప్రాయాన్నినిక్కచ్చిగా చెప్పేవారు. రాజ్యసభలో మాట్లాడటానికి నేను ఎక్కువ సమయం కోరుకున్నప్పుడు, ఆయన నాకు ఇచ్చేవారు’ అని సిబర్ అన్నారు.
ధన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
` ఆయురారోగ్యాలతో ఉండాలని మోదీ ఆకాంక్ష
` రాష్ట్రపతిని కలిసిన డిప్యూటి ఛైర్మన్ హరివంశ్ భేటీ
` మర్యాదపూర్వక భేటీ అంటూ ప్రకటన విడుదల
న్యూఢల్లీి(జనంసాక్షి):ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా సమర్పించగా.. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దానికి ఆమోదం తెలిపారు. ఈ సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయం హోంమంత్రిత్వ శాఖకు తెలియజేసింది. అలాగే దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. అనారోగ్య కారణాలతో ధన్‌ఖడ్ రాజీనామా చేస్తున్నాట్లుగా ప్రకటించారు. అయితే ఆయన రాజీనామాపై ఎలాంటి అనుమానాలు ప్రభుత్వం పక్షాన వ్యక్తం కాలేదు. సరికదా ఆయన ఆయురారోగ్యా లతో ఉండాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతి పదవితో సహా వివిధ హోదాల్లో ధన్‌ఖడ్ దేశానికి సేవలు అందించారని అన్నారు. రాజ్యసభ ఛైర్మన్ హోదాలో పార్లమెంటు- వర్షాకాల సమావేశాల తొలిరోజున కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ధన్‌ఖడ్.. రాత్రి కల్లా అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపారు. అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు- అందులో పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ)కు అనుగుణంగా నేను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నా. బాధ్యతల నిర్వహణలో నాకు అండగా నిలిచిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు. పదవీకాలంలో మేం చాలా ప్రశాంతమైన, అద్భుతమైన వర్కింగ్ రిలేషన్‌ను కొనసాగించాం. ప్రధాన మంత్రి, మంత్రి మండలికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అని ధన్యవాదాలు చెప్పారు. 2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్‌ఖడ్‌కు 2027 ఆగస్టు వరకూ పదవీకాలం ఉంది. అయితే రెండేళ్ల 344 రోజులకే ఆయన వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దేశ 14వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన సోమవారం సాయంత్రం వరకూ ఆరోగ్యంగా కనిపించినప్పటికీ రాత్రికి అదే కారణంతో రాజీనామా చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ధన్‌ఖడ్ రాజీనామా ఊహించని పరిణామమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఆరోగ్య అంశం కంటికి కనిపిస్తున్నా కనిపించనివి ఏవో దీనివెనక ఉండి ఉంటాయని అనుమానం వ్యక్తంచేసింది.
రాష్ట్రపతి ముర్ముతో డిప్యూటి ఛైర్మన్ హరివంశ్ భేటీ
రాజ్యసభ డిప్యూటీ- చైర్మన్ హరివంశ్ మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సోమవారం సాయంత్రం జగదీప్ ధన్‌ఖర్ ఉప రాష్ట్రపతిగా రాజీనామా చేయగా మంగళశార్ రాష్ట్రపతి దానిని ఆమోదించారు. ఈ నేపథ్యంలో హరివంశ్ రాష్ట్రపతిని కలువడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి భవన్ ’ఎక్స్’ పోస్ట్‌లో భేటీకి సంబంధించిన చిత్రాన్ని షేర్ చేసింది. రాజ్యసభ డిప్యూటీ- చైర్మన్ హరివంశ్ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసినట్లు- తెలిపింది. జగదీప్ ధన్‌ఖర్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే పదవికి రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చారు. మంగళవారం రాజ్యసభలో ఉదయం హరివంశ్ సభకు అధ్యక్షత వహించారు. అయితే, విపక్షాల ఆందోళనలతో ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ కార్యకలాపాలు బుధవారానికి వాయిదాపడ్డాయి. ఉపరాష్ట్రపతి రాజీనామా కారణంగా రాజ్యసభ చైర్మన్ పదవి సైతం ఆటోమేటిక్‌గా ఖాళీ అయ్యింది. ఉపరాష్ట్రపతి ఎగువ సభకు ఎక్స్-అఫిషియో చైర్మన్. ఈ
పరిస్థితుల్లో ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలుపడంతో వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ కార్యకలాపాలు మొత్తం డిప్యూటీ- చైర్మన్ హరివంశ్ చూసుకోనున్నారు. పార్లమెంట్ సమావేశాల తొలిరోజున జగదీప్ ధన్‌ఖర్ చురుగ్గానే కనిపించారు. ఉదయం సభలో సానుకూలంగా చర్చలు జరపాలని ఆయన సభ్యులకు సూచించారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మాన నోటీసును అంగీకరించిన ఆయన.. పక్రియను వివరించారు. జస్టిస్ శేఖర్ యాదవ్‌పై సమర్పించిన అభిశంసన నోటీసులో ఒక ఎంపీ డబుల్ సంతకంపై విచారణను చేయనున్నట్లు- తెలిపారు. అయితే, ఆరోగ్య కారణాలు పేర్కొంటు- ఆయన తక్షణం అమలులోకి వచ్చేలా ఆయన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన రాజీనామా లేఖలో వైద్యుల సూచన మేరకు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేందుకు రాజీనామా చేస్తున్నట్లు- ఆయన వెల్లడిరచారు.ఆయన మార్చిలో ఎయిమ్స్‌లో చేరారు. ఆ తర్వాత వైద్యులు ఆయనను ఢల్లీి వెలుపలకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. జూన్‌లో ఉత్తరాఖండ్‌లోని కుమావున్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన వేదికపైనే స్పృహ కోల్పోయారు. ఆ రోజు వేడి పరిస్థితులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఆయన కేరళలో పర్యటించారు. ఈ సమయంలో ఆరోగ్యం క్షీణించగా.. భార్య ఆయనకు అండగా ఉన్నారు. జులై 17న ఢల్లీిలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన భార్య మంచినీళ్లు తీసుకువచ్చి ఇవ్వగా పరిస్థితి మెరుగైంది. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వైద్యుల సూచనల మేరకు కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు- తెలుస్తున్నది.