ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి

 

 

 

 

 

సూర్యాపేట(జనంసాక్షి): రాఘవపురం క్రాస్ రోడ్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆ గ్రామ నూతన సర్పంచ్ గా ఎన్నికైన కోల లింగయ్య అన్నారు.సోమవారం రాఘవ పురం క్రాస్ రోడ్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు.గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.ఇచ్చిన హామీల అన్నింటిని నెరవేరుస్తానని అన్నారు.అనంతరం నూతనంగా ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాటికొండ సుజిత్ రెడ్డి,వార్డు సభ్యులు, నాయకులు కారింగుల లింగమూర్తి, మండవ శ్రీను, బత్తిని శ్రీను, బట్టిపల్లి సైదులు, బట్టిపల్లి నాగమల్లయ్య, తాటికొండ సోమిరెడ్డి, రాచకొండ సోమయ్య రాచకొండ మల్సూర్,కోలా కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.