ప్రతి ఒక్కరూ పెద్దల పట్ల గౌరవం, దేశభక్తి కలిగి ఉండాలి

 

 

 

 

 

 

భూదాన్ పోచంపల్లి, జనవరి 13 (జనం సాక్షి): ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ మైదానంలో పథసంచలాన్ మరియు సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ క్రమశిక్షణతో పథసంచలాన్ నిర్వహించగా, స్థానికులు స్వయం సేవకులపై పుష్పవర్షం కురిపించారు. ముఖ్య అతిధులుగా డా. సీత భాస్కర్, ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ కార్యవాహ మంత్రి శ్రీధర్ పాల్గొన్నారు. డా. సీత భాస్కర్ మాట్లాడుతూ, యువతకు సంస్కృతి, సంప్రదాయాల విలువలు తెలియజేయడంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర కీలకమన్నారు. ప్రతి ఒక్కరు పెద్దల పట్ల గౌరవం, దేశభక్తి కలిగి ఉండాలన్నారు. శ్రీధర్ మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్ దేశభక్తి భావాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్లాస్టిక్ రహిత భారత్ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.