అభివృధ్ది పనులు పూర్తి చేయడంలో విఫలం

మంథని, (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో అభివృధ్ది పనులు పూర్తి చేయడంలో మంత్రి పూర్తిగా విఫలం అయ్యారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీకాలనీ తెలంగాణ చౌక్‌ లో అసంపూర్తిగా ఉన్న కల్వర్టు నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పెద్దపల్లి కాటారం వరకు డీఎంఎఫ్‌టీ ద్వారా రూ. 300 కోట్ల నిధులు మంజూరీ చేయించి రోడ్డు పనులు ప్రారంభించామని తెలిపారు. 70 నుంచి 80 శాతం రోడ్లు పనులు పూర్తి కాగా టెన్‌మీటర్స్‌అని కొంత ఏరియా, గ్రామాల్లో సెంటర్‌ లైటింగ్‌, డివైడర్లు, డ్రైనేజీల పనులు తీసుకురావడంతో 20శాతం పనులు మిగిలిపోయాయని అన్నారు. అయితే తెలంగాణ చౌక్‌ వద్ద చేపట్టిన కల్వర్టు వద్ద రోడ్డు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, మంథని ఎమ్మెల్యే ఈ రహదారి గుండానే రాకపోకలు సాగిస్తున్నా పూర్తి చేయడం లేదన్నారు. కాంట్రాక్టర్‌, సంబంధిత శాఖ ఈఈలతో మాట్లాడితే బిల్లులు రాక పనులు చేయలేకపోతున్నామని చెబుతున్నారని, కనీసం బిల్లులు ఇప్పించి పనులు పూర్తి చేయించకపోవడం సిగ్గు చేటు అన్నారు. 16 మాసాల క్రితం శిలాఫలకం వేసిన పనులు పూర్తి చేయకుండా మళ్లీ మంత్రి శిలాఫలకాలు వేస్తున్నాడని, కమాన్‌పూర్‌ మండలంలో ఎమ్మార్వో ఆఫీస్‌ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారని ఆయన విమర్శించారు. ప్రజలు ఓట్లు వేస్తనే మంత్రి పదవి వచ్చిందనే విషయాన్ని మంథని ఎమ్మెల్యేగుర్తించాలన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడికి పెద్ద పదవి వస్తే ఆ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృధ్ది చేయడంతో పాటు అక్కడి ప్రజలకు మేలు చేసే పనులు చేస్తారని, కానీ ఇక్కడ మాత్రం అందుకు బిన్నంగా జరుగుతోందన్నారు. చేయవద్దన్నారు. 16 నెలల కాలంలో ఈ రోడ్డు పనులను పూర్తి చేయలేదని, ఓడేడ్‌ బ్రిడ్జి గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. వెంటనే మంథని నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అన్నారు.

తాజావార్తలు