చెట్లను తొలగించిన యజమానులకు జరిమానా

 

 

 

 

 

 

చెన్నారావుపేట, జనవరి 9 (జనం సాక్షి):

ధర్మ తండా పంచాయతీ కార్యదర్శి ఎర్రబెల్లి శ్యామ్…

రోడ్డు పక్కన ఉన్న చెట్లను అక్రమంగా తొలగించిన యజమానులకు నోటీసులు జారీచేసి జరిమానా విధించినట్లు ధర్మ తండా పంచాయతీ కార్యదర్శి ఎర్రబెల్లి శ్యామ్ తెలిపారు. గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న చెట్లను ముగ్గురు వ్యక్తులు అక్రమంగా నరికి వేశారన్నారు. వారికి నోటీసులు జారీ చేసి ఒక్కొక్కరికి రూ. 1500 చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. అంతేకాక తొలగించిన చెట్ల స్థానంలో నూతనంగా మొక్కలు నాటాలని సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోడ రవి, ఫీల్డ్ అసిస్టెంట్ కన్నం తిరుపతి, పాల్గొన్నారు.