కమిషనర్ ని కలిసిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ కొయ్యడ ఉదయ్ కుమార్ ను మంగళవారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ సమస్యల గురించి కమిషనర్ తో చర్చించారు. పట్టణంలో నెలకొన్న సానిటేషన్, కుక్కల బెడద, కోతుల బెడద నుండి ప్రజలను కాపాడాలని చెప్పారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ సత్వరమే చర్యలు చేపడతామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ముంజంపల్లి మురళిధర్, ఎడ్ల మౌనిక శ్రీనివాస్, టౌన్ యూత్ ప్రధాన కార్యదర్శి పోలవేని మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


