ఊసరవెల్లిలు.. వారసులు ఎలా అవుతారు..?
మంథని, (జనంసాక్షి) : తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఊసరవెల్లిలా పార్టీలు మారిన నాయకులు.. నేడు తామే నిజమైన రాజకీయ వారసులమని, కుటుంబ సభ్యులమని చెప్పుకోవడం పట్ల ఆ పార్టీ శ్రేణులు, ఆ మండల ప్రజలు నవ్వుకుంటున్నారు. నాడు నమ్ముకున్న నాయకుడికి వెన్నుపోటు పొడిచి. . అధికారంలో ఉన్న పార్టీలో చేరి ఆ నాయకుడి మెప్పు పొందడం కోసం చేగువేరా అని వాళ్ళు రైటింగ్స్ రాయించడమే కాకుండా.. నేటి నాయకుడిపై గతంలో విమర్శలు చేసిన విషయం ప్రజలు, పార్టీ శ్రేణులు నేటికీ మరిచిపోతారని అనుకోవడం అవివేకం. నాడు మిషన్ కాకతీయను కమిషన్ కాకతీయగా మార్చి, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు వసూలు చేసిన ఘటనలో కీలక పాత్ర పోషించిన సదరు నాయకుడు నేడు మళ్లీ ఈ పార్టీలోకి వచ్చి మేమే నిజమైన వారసులమని, కుటుంబ సభ్యులమని చెప్పుకోవడం సిగ్గుచేటు అని ప్రజలు, పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. గతాన్ని మర్చిపోయి శుద్ధపూసలాగా మాట్లాడం పట్ల అందరూ ముక్కున వేలుకుంటున్నారు.. ! ఇప్పటికైనా గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలని, తమకు అంతా తెలుసునని ప్రజలు, పార్టీ శ్రేణులు హితవు పలుకుతున్నారు.