ఘనంగా ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి

 

 

 

 

బచ్చన్నపేట నవంబర్ 19 ( జనం సాక్షి): బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ హరిబాబు గౌడ్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ మహమ్మద్ మసూద్ ఆధ్వర్యంలొ మాజీ ప్రధాని ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారత దేశం లో పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాల అభివృద్ధికి చేశారని భూమి లేని పేదలకు భూములు పంచిన ఘనత ఇందిరమ్మదే అన్నారు. బ్యాంకులను జాతీయం చేసి ఇళ్ళు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించిందని ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య.సిద్దులగుట్ట చైర్మన్ మల్లారెడ్డి. ఇజ్జగిరి రాములు. ఎల్లారెడ్డి.రామకృష్ణ. నీల రమేష్.నిమ్మ కరుణాకర్ రెడ్డి. యాకూబ్ పాషా. రమేష్ రెడ్డి. బొమ్మెన రాజయ్య.అల్వాల రమేష్.చెరుకూరి శ్రీనివాస్.గిద్దల రమేష్ . బొమ్మెన రాజయ్య, శివ రాములు. లక్ష్మయ్య. అంబాల ఆగయ్య. జంగిలి సామి. నిమ్మ కరుణాకర్ రెడ్డి.వేణు వందన, గుర్రం బాలరాజ్, జంగిడి సిద్ధులు. దతరపు నరేష్, ప్రకాష్, సిద్ధిరములు, శ్రీధర్ రెడ్డీ, సోషల్ మీడియా కనకరాజ్. నాగరాజు. మోహన్ తదితరులు పాల్గొన్నారు