నాగిరెడ్డి పల్లి సర్పంచ్ గా జక్క రాఘవేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

భువనగిరి,డిసెంబర్ 23 (జనం సాక్షి):మండల పరిధిలోని నాగిరెడ్డి పల్లి గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌గా జక్క రాఘవేందర్ రెడ్డి సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామ సచివాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాసాని శేఖర్ తో పాటు వార్డు సభ్యులు కూడా తమ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, నాయకులు సర్పంచ్ జక్క రాఘవేందర్ రెడ్డి ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రజలతో కలిసి సమన్వయంతో పనిచేస్తానని పేర్కొన్నారు



