కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చిస్తాం

` నివేదిక సభలో ప్రవేశపెడతాం
` అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుంటాం
` రూ.లక్షకోట్ల ప్రాజెక్టు కుంగిపోవడం బాధాకరం
` కాళేశ్వరం కమిషన్‌కు నివేదికకు కేబినెట్‌ ఆమోదం
` ఈ నివేదిక ప్రభుత్వం ఇచ్చింది కాదు: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్‌(జనంసాక్షి): కాళేశ్వరం కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ సమర్పించిన నివేదిక కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడిరచారు. దీనిని అసెంబ్లీలో పెడతామని అన్నారు. విచారణకు సంబంధించిన వివరాలను కమిషన్‌ విశ్లేషణాత్మకంగా నివేదికలో పొందుపరిచిందని చెప్పారు. క్యాబినెట్‌ భేటీ అనంతరం మంత్రులతో కలిసి నిర్వహించిన విూడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్‌ నివేదికను త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెడతామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు- తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక భవిష్యత్తు కార్యాచరణతో పాటు- కమిషన్‌ సూచనలను అమలు చేసేందుకు ముందుకెళ్తామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ఎవరిపైనా కక్ష సాధింపులు, వ్యక్తిగత ద్వేషం తమ ఉద్దేశం కాదనే అన్ని వివరాలనూ విూడియా ముందు ఉంచామని తెలిపారు. జలవనరుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దాదాపు రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోయే ప్రమాదంలో పడిరది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగాన్ని దృష్టిలో పెట్టు-కొని న్యాయ విచారణ కోసం జస్టిస్‌ పీసీ ఘోష్‌ను నియమించాం. ఘోష్‌ కమిషన్‌ అందరితో మాట్లాడి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఇందులో రాజకీయ ఆరోపణలు లేవు. ఇది ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు కాదు.. స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్‌ ఇచ్చిన రిపోర్టు. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణ అవకతవకలు అన్నింటికీ బాధ్యుడు, జవాబుదారీ అప్పటి సీఎం కేసీఆరే అని నివేదికలో పేర్కొన్నారు. నిపుణుల కమిటీ- సూచనలకు కాకుండా సొంత నిర్ణయంతోనే మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం అవకతవకలపై విచారణ చేయిస్తామని మేనిఫెస్టోలో చెప్పామని, కమిషన్‌ చైర్మన్‌గా వ్యవహరించిన పీసీ ఘోష్‌ నిబద్ధత ఉన్న వ్యక్తి అని రేవంత్‌ చెప్పారు. కేసీఆర్‌, హరీష్‌ రావు సహా అనేక మందిని ఘోష్‌ విచారించారని, 16 నెలల విచారణ తరువాత 665 పేజీల నివేదిక ఇచ్చారని సీఎం తెలిపారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని..అలా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వారి హయాంలోనే కూలిపోయిందని సీఎం విమర్శించారు. వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్లను ప్రారంభించారని, రీడిజైనింగ్‌ పేరుతో కేసీఆర్‌ డిజైన్లను మార్చారని ఆరోపించారు. ప్రాజెక్ట్‌ నిర్మించిన మూడేళ్ల లోపే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని సీఎం గుర్తు చేశారు. అన్నారం, సుందిళ్లలో కూడా లోపాలున్నాయని రిపోర్ట్‌ ఇచ్చిందని సీఎం రేవంత్‌ చెప్పారు. కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని, త్వరలోనే అసెంబ్లీకి నివేదికను రిపోర్ట్‌ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని పార్టీల సూచనలు, అభిప్రాయాలు తీసుకుంటామని సీఎం తెలిపారు. అందరి ఆమోదం మేరకు ఏం చేయాలో నిర్ణయిస్తామని రేవంత్‌ చెప్పారు. ప్రజాప్రతినిధులకు కమిషన్‌ నివేదిక ఇస్తామని, అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చని సీఎం రేవంత్‌ వెల్లడిరచారు. ఎవరి పైనా వ్యక్తిగత ద్వేషంతో నిర్ణయాలు తీసుకోవడం లేదని, కమిషన్‌ రిపోర్ట్‌పై ఎవరు ఏ రకంగా మాట్లాడతారనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

 

కాళేశ్వరం లోపాలకు కేసీఆర్‌దే బాధ్యత
` కమిషన్‌ తేల్చిచెప్పింది: ఉత్తమ్‌
` ప్రాజెక్టు కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పణంగా పెట్టారు
` రూ.38వేల కోట్లతో తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా.. మేడిగడ్డకు మార్పు
` భారీగా తెచ్చిన అప్పులతో చేపట్టిన కాళేశ్వరం.. భారాస హయాంలోనే కుంగిపోయింది
` రాజకీయాలకు తావు లేకుండా విచారణ: మంత్రి ఉత్తమ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత పాలకులు అధిక వడ్డీలతో రూ.84వేల కోట్ల అప్పు తెచ్చారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. క్యాబినెట్‌ భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. రూ.38వేల కోట్లతో తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా.. మేడిగడ్డకు మార్చారని చెప్పారు. భారీగా తెచ్చిన అప్పులతో చేపట్టిన కాళేశ్వరం.. భారత రాష్ట్ర సమితి హయాంలోనే కూలిపోయిందన్నారు. ‘‘మేడిగడ్డ బ్యారేజ్‌పై న్యాయ విచారణ చేయిస్తామని గతంలోనే హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చాక జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో న్యాయ విచారణ చేపట్టాం. రాజకీయ అంశాలు జోడిరచకుండా విచారణ జరపాలని కోరాం. 660 పేజీలతో నివేదికను కమిషన్‌ నీటిపారుదల శాఖకు ఇచ్చింది. నివేదికను ముగ్గురు అధికారుల కమిటీ 25 పేజీలతో సంక్షిప్తం చేసింది. 2016లో మేడిగడ్డ ప్రాజెక్టు అగ్రిమెంట్‌ జరిగింది. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2023లో మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోయింది. బ్యారేజ్‌ కుంగుబాటుపై ఎన్‌డీఎస్‌ఏ (నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ) నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ నిర్మాణంలో ప్లానింగ్‌, డిజైన్‌లో లోపాలున్నాయని తేలింది. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులోనూ ఇదే సమస్య ఉందని కమిటీ వెల్లడిరచింది. మూడు బ్యారేజీల్లో నీటి నిల్వకు అవకాశం లేదని తెలిపింది.
ఆ లేఖ వెనుక దురుద్దేశాలు
తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవన్న కేసీఆర్‌ నిర్ణయం నిజాయతీతో కూడిరది కాదని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిటీ పేర్కొంది. అక్కడ తగినంత నీరు ఉందని అప్పటి కేంద్రమంత్రి ఉమాభారతి చెప్పారు. 70శాతం నికర నీటి లభ్యత ఆధారంగా హైడ్రాలజీ క్లియరెన్స్‌ ఇచ్చినట్లు కేంద్రం లేఖ రాసింది. కేంద్రం నిర్ణయాన్ని కాదని నీటి లభ్యత లేదని గత ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని అర్థం అవుతోంది. కేసీఆర్‌ వేసిన నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజ్‌ వద్దని చెప్పింది. ప్రాణహిత మీద బ్యారేజ్‌ కట్టొచ్చని సూచించింది. నిపుణుల కమిటీ నివేదికను పక్కనపెట్టి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పణంగా పెట్టి మేడిగడ్డ వద్ద బ్యారేజ్‌ కట్టాలని నిర్ణయించారు.
సీఎం నోటిమాట మేరకు కాంట్రాక్టులు
ప్రాజెక్టుపై అప్పటి క్యాబినెట్‌ భేటీలో చర్చించలేదు. సీఎం నోటిమాట మేరకు కాంట్రాక్టులు ఇచ్చారు. ప్రజాధనం కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు విలువలను రివైజ్‌ చేశారు. మేడిగడ్డ నిర్మాణంపై అప్పటి నీటిపారుదల మంత్రి నిర్ణయం చట్టబద్ధం కాదు. మేడిగడ్డ నిర్మాణానికి ఇచ్చిన జీవోను క్యాబినెట్‌ సమావేశంలో పెట్టలేదు. ఇంతపెద్ద ప్రాజెక్టుకు క్యాబినెట్‌ ఆమోదం అవసరం.. తప్పనిసరి కూడా. క్యాబినెట్‌ ఆమోదం లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయకూడదు. మేడిగడ్డ నిర్మాణానికి ఇచ్చిన జీవోలు 230, 231, నిర్మాణ అనుమతులు చట్ట వ్యతిరేకం. కాళేశ్వరం రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ అన్నింటికీ కేసీఆర్‌ వ్యక్తిగతంగా బాధ్యుడని కమిటీ పేర్కొంది’’అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు.

 

కాళేశ్వరం నిర్మాణానికి పూర్తి బాధ్యత కేసీఆర్‌దే
` నివేదికపై అధికారుల కమిటీ వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికను అధికారుల కమిటీ అధ్యయనం చేసింది. దీని సారాంశాన్ని సిద్ధం చేసింది. అందులోని వివరాల ప్రకారం.. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణ నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్‌దేనని నిర్ధారించారు. నిపుణుల కమిటీ- నివేదికను అప్పటి సీఎం కేసీఆర్‌, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పక్కకు పెట్టారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్నది సహేతుక కారణం కాదు. బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం జరగలేదు. వ్యాప్కోస్‌ నివేదిక, డీపీఆర్‌ కంటే ముందే బ్యారేజీలకు సిద్ధం అయ్యారు. టెండర్లు, ఓ అండ్‌ ఎం డిజైన్‌, నాణ్యతలో లోపాలున్నాయి. బ్యారేజీల నిర్మాణానికి పూర్తి బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్‌దే. జవాబుదారీతనం, పాలనాపరమైన విధానాలు పాటించలేదు. పాలనా విధానాలు అనుసరించకుండా హరీశ్‌రావు ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక జవాబుదారీ తనాన్ని అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ పాటించలేదు. కాళేశ్వరం బోర్డులో అధికారులు ఉన్నా వారికి సంబంధం లేదని ఈటల చెప్పారు. ప్రణాళిక, నిర్మాణం, ఓ అండ్‌ ఎం, నీటినిల్వ, ఆర్థిక అంశాలకు అప్పటి సీఎందే బాధ్యని అన్నారు. కాళేశ్వరంలో ఆర్థిక అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన జరిగింది. ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైంది. బ్యారేజీలు దెబ్బతినడానికి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలే కారణం. నిర్మాణ స్థలం మార్పు, అంచనాల సవరింపులో అవకతవకలున్నాయి. డిజైన్ల లోపాలు, నాణ్యత తనిఖీలు లేకపోవడంతో నష్టం జరిగింది. ప్రజాధనం దుర్వినియోగానికి బోర్డు సభ్యులు కూడా బాధ్యులు. కాళేశ్వరం బోర్డులోని అధికారులపై క్రిమినల్‌ బీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌ కింద చర్యలు తీసుకోవాలి. మేడిగడ్డ నిర్మాణంపై ఎల్‌ అండ్‌ టీ సంస్థకు ఎలాంటి సర్టిఫికెట్లు- ఇవ్వొద్దు. బ్యారేజీ ఏడో బ్లాక్‌ను ఆ సంస్థ పునరుద్ధరించాలి. ఇతర ఆనకట్టల్లో లోపాల సవరణ కూడా చేయాల్సిందే. ఈ వ్యయాన్ని ఎల్‌ అండ్‌ టీనే భరించాలని ఈ మేరకు నివేదిక సారాంశాన్ని అధికారుల కమిటీ- వెల్లడిరచింది.

 

2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా తెలంగాణ
` లైఫ్‌సైన్సెస్‌ రాజధానిగా హైదరాబాద్‌
` ఇక్కడ తయారైన ఔషధాలు, టీకాలు చాలా దేశాలకు ఎగుమతి అవుతున్నాయ్‌
` ఫార్మా కంపెనీలకు ప్రత్యేక జీనోమ్‌ వ్యాలీ : సీఎం రేవంత్‌
` లిల్లీ ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):లైఫ్‌ సైన్సెస్‌ కేపిటల్‌గా హైదరాబాద్‌ కు గుర్తింపు లభించిందని సిఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ లో ఫార్మా కంపెనీలకు జినోమ్‌ వ్యాలీ ప్రత్యేకమైనది అన్నారు. అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీని, గచ్చిబౌలిలో ప్రముఖ లిల్లీ ఫార్మా కంపెనీని సిఎం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ విూడియాతో మాట్లాడుతూ..2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానవిూగా తెలంగాణ ఉంటుందని తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో 10 శాతం తెలంగాణ నుంచే అందిస్తామని, హైదరాబాద్‌ నుంచే 40 శాతం ఫార్మా ఉత్పత్తులు, అత్యధిక వ్యాక్సిన్లు తయారవుతున్నాయని అన్నారు. పరిశ్రమలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, అభివృద్ధి, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్‌ను భవిష్యత్‌ గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ హబ్‌ గా మారుస్తామని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఈరోజు చరిత్రక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. 2000లకు పైగా లైఫ్‌ సెన్సెస్‌ కంపెనీలు హైదరాబాద్‌ లో ఉన్నాయని చెప్పారు. 200కి పైగా ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ నగరం నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఆఫ్‌ ఇండియాగా మారుతోందన్నారు. 2047 నాటికి తెలంగాణను ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమిగా తీర్చి దిద్దడమే లక్ష్‌యంగా పనిచేస్తున్నాం. ఎలీ లిల్లీ సంస్థ లీడర్‌ షిప్‌ ను, ఉద్యోగులను హైదరాబాద్‌ నగరానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఈ రోజు ప్రారంభమైన ఎలీ లిల్లీ నూతన కేంద్రం… ఆ సంస్థ గ్లోబల్‌ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీ, ఇన్నొవేషన్‌ సెంటర్‌, ప్రపంచవ్యాప్తంగా రోగులకు పరిష్కారాల కోసం పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎలీ లిల్లీ సంస్థను హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు- చేయడమంటే ఈ నగరం ఘనతను విూరు ప్రపంచానికి చాటి చెప్పినట్లే. హైదరాబాద్‌ నగరంలో టాలెంట్‌ ఉంది, లీడర్‌షిప్‌ ఉంది, విజన్‌ ఉంది, మంచి పాలసీ ఉంది, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అందుకే ఎలీ లిల్లీ లాంటి గ్లోబల్‌ లీడర్‌కు ఇది అనుకూలమైన కేంద్రంగా మారింది. భారతదేశ లైఫ్‌ సైన్సెస్‌ రాజధానిగా హైదరాబాద్‌ ఇప్పటికే గుర్తింపు పొందిందని అన్నారు. భారత్‌లో ఫార్మాస్యూటికల్‌ ఉత్పత్తిలో సుమారు 40 శాతం తెలంగాణలోనే జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్రతి 3 టీ-కాలలో ఒకటి హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడం లేదా తయారవుతుండటం మాకు గర్వకారణం. హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీ, భారత దేశంలోని అతిపెద్ద లైఫ్‌ సైన్సెస్‌ పరిశోధన- అభివృద్ధి సముదాయంగా నిలిచింది. ప్రపంచంలోని అగశ్రేణి ఫార్మాస్యూటికల్‌, బయో-టె-క్నాలజీ సంస్థల కోసం హైదరాబాద్‌ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా మారింది. ఈరోజు, ఎలీ లిల్లీ సంస్థ రాకతో, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో మేము మరో మెట్టు-కు చేరుకున్నాం. మధుమేహం, ఆంకాలజీ, ఇమ్యునాలజీ, న్యూరోసైన్స్‌ రంగాలలో ఎలీ లిల్లీ సంస్థ కృషి ఒక గేమ్‌ఛేంజర్‌ గా నిలిచిపోతుందని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రిపోర్టు ఊహించిందే..
` త్వరలో కొంత మంది బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్ట్‌ కావొచ్చు
` అయినా భయపడేది లేదు.. కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
` అది కాళేశ్వరం కాదు.. కాంగ్రెస్‌ కమిషన్‌
` పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపు
గజ్వెల్‌(జనంసాక్షి): కొంత మంది బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్ట్‌ చేయవచ్చు.. భయపడ వద్దని వారికి బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనికిరాదన్నవాడు అజ్ఞాని అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్‌ దుష్పచ్రారాన్ని తిప్పికొట్టాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాళేశ్వరంపై కేబినెట్‌లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామని పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్‌ సమావేశంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్‌ నివేదికను పవర్‌ పాయింట్‌ ద్వారా ప్రజెంటేషన్‌ చేశారు. అదే సమయంలో ఎర్రవల్లిలోని తన ఫామ్‌ హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాళేశ్వరం కమిషన్‌ కాదు.. కాంగ్రెస్‌ కమిషన్‌ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌ ఊహించినదేనని స్పష్టం చేశారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలను నిర్మించారు. అయితే 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగాయి. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో రేవంత్‌ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. అనంతరం ఈ ప్రాజెక్ట్‌లో చోటు- చేసుకున్న అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.దాదాపు 15 నెలలపాటు ఈ కమిషన్‌ విచారణ జరిపింది. చివరకు జులై 31వ తేదీన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌.. తన నివేదికను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు అందజేసింది. ఆగస్టు 1వ తేదీన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ నివేదికను సీఎం రేవంత్‌ రెడ్డికి అందజేశారు. ఈ నివేదికపై ముగ్గురు అధికారులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు- చేసింది. ఈ కమిటీ- ఆదివారం సమావేశమై.. చర్చింది. ఈ కమిటీ- అందించిన నివేదికపై తెలంగాణ సచివాలయంలో సోమవారం జరిగిన కేబినెట్‌ భేటీ-లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. అదీకాక లక్షల కోట్ల రూపాయిలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ స్పష్టం చేసింది. ఇంకా చెప్పాలంటే.. ఈ ప్రాజెక్ట్‌కు కర్మ, కర్త, క్రియ అంతా కేసీఆర్‌ అని చెప్పకనే చెప్పింది. ఇదిఆవుంటే కేసీఆర్‌ యాగం చేయనున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

 

3.కాళేశ్వరంపై వడ్డీ తగ్గింపుకు కృషి చేస్తాం
` ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ విషయమే ఆలోచిస్తాం
లోక్‌సభలో ఎంపీ చామల ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢల్లీి(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రుణాల చెల్లింపు, రీ షెడ్యూల్‌ మార్పు చేస్తే ఆర్బీఐ నిబంధనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఖాతా స్టాండర్డ్‌ నుంచి సబ్‌ స్టాండర్డ్‌కు డౌన్‌ గ్రేడ్‌ అవుతుందని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల పునర్‌ వ్యవస్థీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయి. ప్రాజెక్టు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌కు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిఫ్రికేషన్‌ కార్పొరేషన్‌ రుణాలు ఇచ్చాయి. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ లాంటి నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు.. వివిధ మార్గాల్లో నిధులను సేకరిస్తాయి. వాటికయ్యే ఖర్చుల ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు. ప్రాజెక్టు పూర్తయ్యే సమయాన్ని ఇప్పటికే డిసెంబర్‌ 2024కు ఆర్‌ఈసీ పొడిగించింది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపును పరిశీలిస్తాం అని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది.కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల రిస్టక్చ్రర్‌కు తెలంగాణ ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయని కేంద్రమంత్రి పంకజ్‌ చౌదరి గుర్తుచేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యే సమయాన్ని ఇప్పటికే డిసెంబర్‌ 2024కు ఆర్‌ఈసీ పొడిగించిందని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు.