కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని నేతల పిలుపు

భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 11 (జనం సాక్షి):
పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
గ్రామాల అభివృద్ధి చేయగల సామర్థ్యం కాంగ్రెస్‌కే ఉందని వ్యాఖ్య
విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నేతలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు తడక వెంకటేష్, పాక మల్లేష్ యాదవ్, సామ మధుసూదన్ రెడ్డి, కళ్లెం రాఘవరెడ్డి, మర్రి నర్సింహా రెడ్డి, భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 14న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే, నిజాయితీగా పనిచేసే నాయకత్వం అవసరమని చెప్పారు. ఇందుకు కాంగ్రెస్ అభ్యర్థులే సరైన ఎంపిక అని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేసిందని, వాటి ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమైందని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో గ్రామాలు మరింత ముందుకు సాగాలంటే కాంగ్రెస్‌ను బలపరచాలని నేతలు పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసే నాయకులు, వార్డు సభ్యులపై కఠిన చర్యలు తప్పవని మండల కోర్ కమిటీ స్పష్టం చేసింది.


