ఎన్నికలకు ప్రశాంత వాతావరణం కల్పిద్దాం

టేకులపల్లి,డిసెంబర్ 9(జనంసాక్షి):

* రాజకీయ నాయకులకు సీఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి ఎస్ ఐ రాజేందర్ సూచన

టేకులపల్లి మండలంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత ప్రశాంత వాతావరణన్ని కల్పించి స్వేచ్ఛగా ఓటు ప్రజలు వినియోగించుకునేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారయణ, టేకులపల్లి ఎస్ ఐ ఏ రాజేందర్ కోరారు.ఎన్నికల కోడ్,శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మంగళవారం సుక్కలబోడులో తన సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు.​ఈ సందర్భంగా అక్కడ ఉన్న వివిధ పార్టీల నాయకులు,ముఖ్య కార్యకర్తలతో సీఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి ఎస్ ఐ రాజేందర్ మాట్లాడారు.ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన లకు తావులేకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు.సోషల్ మీడియా లో పార్టీలను గానీ, వ్యక్తులను గానీ కించపరిచే విధంగా పోస్ట్ చేయకూడదని సూచనలు చేశారు. గ్రామీణ స్థాయి నుండి మండల స్థాయి వరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.​పోలీసుల సూచనలు పాటిస్తూ, ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రచారం నిర్వహించు కోవాలని సూచించారు. సమస్యాత్మక అంశాలపై పోలీసులు నిఘా ఉంచారని,అందరూ బాధ్యత యుతంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.​ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పలు పార్టీల స్థానిక నాయకులు పాల్గొన్నారు.