గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్

డిసెంబర్ 08 ఖమ్మం, (జనం సాక్షి): డిసెంబర్ 11,14,17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. డిసెంబర్ 11 న జరిగే ఎన్నికలకు డిసెంబర్ 9 వ తేదీన సాయంత్రం 5:00 గంటల నుండి డిసెంబర్ 11న ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించే వరకు ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలన్నారు. (కొణిజర్ల,రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం )
అదేవిదంగా డిసెంబర్ 14 న జరిగే ఎన్నికలకు డిసెంబర్ 12 వ తేదీన సాయంత్రం 5:00 గంటల నుండి డిసెంబర్ 14న ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించే వరకు ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలి.
(కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి,ముదిగొండ, నేలకొండపల్లి,తిరుమలాయపాలెం)
డిసెంబర్ 17 న జరిగే ఎన్నికలకు డిసెంబర్ 15 వ తేదీన సాయంత్రం 5:00 గంటల నుండి డిసెంబర్ 17న ఎన్నికల ముగిసి, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించే వరకు ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలి.(ఏన్కూరు, కల్లూరు,పెనుబల్లి, సత్తుపల్లి,తల్లాడ,వేంసూర్,సింగరేణి)
అదేవిదంగా అయా తేదీలలో ఆయా మండలల్లో వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, మూసివేయాలని ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలలో భాగంగా మూసివేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా సహకరించాలని కోరారు.



