ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే జయంతి

రామకృష్ణాపూర్ (జనంసాక్షి): సామాజిక ఉద్యమ మార్గదర్శి, బహుజన చైతన్య దీప్తి, వివక్షలపై పోరాడి, మహిళా విద్యకు విశేష కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని సూపర్ బజార్ సెంటర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము కొలువుతీరాక ప్రగతి భవన్ పేరుని మహాత్మా జ్యోతిభాపూలే ప్రజా భవన్ గా మార్చి బడుగు, బలహీన వర్గాలకు అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వము అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తుందన్నారు. సామాజిక సాధికారత కోసం తెలంగాణలో సమగ్ర కుల గణన చేపట్టడం, బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వంటి అనేక నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న విషయాలు పూలే స్ఫూర్తితోనేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పి. రఘునాథరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజిజ్, పలిగిరి కనకరాజు, గోపు రాజం, ప్రేమ్ సాగర్, బత్తుల వేణు, శివ కిరణ్, కుర్మ సురేందర్, మహిళా నాయకురాల్లు సునీత, సృజన, రాజేశ్వరి, శారద తదితరులు పాల్గొన్నారు.