బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీ తో గెలిపించండి
పిట్లం డిసెంబర్ 11(జనం సాక్షి)
మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
కెసిఆర్ హయాం లో జుక్కల్ నియోజకవర్గంలో తను చేసిన అభివృద్ధిని చూసి సర్పంచ్ ఎన్నికలు బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నీ గెలిపించాలని జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రజలను కోరారు. గురువారం పిట్లం గ్రామ పంచాయతీ పరిధిలో బిఆర్ఎస్ మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థి జంబిగే హన్మండ్లు కోసం బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. బిఆర్ఎస్ హయాం లో చేసిన అభివృద్ధి, వివరించి బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి జంబిగే హన్మండ్లు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాం లో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించారని అధిక పెన్షన్, అన్ని సదుపాయాలు కల్పించారని అన్నారు తెలంగాణకు రక్ష బిఆర్ఎస్ అని తెలంగాణ కోసం నిత్యం ఆలోచించే బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు

