12న జరిగే వీర హనుమాన్ శోభయాత్రను విజయవంతం చేయండి
ఆర్మూర్ ( జనం సాక్షి) : ఆర్మూర్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్రకు గ్రామ గ్రామాన హిందూ బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి ఆలయం నుండి మొదలుకొని పాత బస్టాండ్ లోని శివాజీ చౌరస్తా వరకు శోభాయాత్ర కొనసాగుతుందన్నారు.ఈ యాత్రలో 15 అడుగుల బలరాముడు విగ్రహం, శివయ్య విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహాలతో ఊరేగింపు ఉత్సాహం జరుగుతుందన్నారు.వీర హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా హిందూ బంధువులందరూ ఇంటింటికి కాషాయ జెండాను ఎగురవేయాలనిపిలుపునిచ్చారు.హిందువులపై దాడులను ఖండిస్తూ,హిందువుల ఐక్యతను ప్రతి ఒక్క హిందూ బంధువు తెలియజేసే విధంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ బజరంగ్ దళ్ జిల్లా ప్రముఖ ప్రచార్ బొచ్కర్ నిఖిల్, టౌన్ ప్రెసిడెంట్ గంగా చరన్, కార్యదర్శి కొంగి రవి, నగర సహకార దర్శి అజయ్, నగర సేవా ప్రముఖ ప్రేమ్, అభి, సురక్ష ప్రముఖ ప్రవీణ్, ధర్మ ప్రచార ప్రముఖ పవన్, బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు.