అభివృద్ధిని అడ్డుకుంటే ద్రోహులే..

` హైదరాబాద్‌ పురోగతికి ఎందరో కృషి చేశారు
` హైటెక్‌ సిటీ కడతామన్నా వ్యతిరేకించారు
` అభివృద్ధిని కొనసాగించాలన్నదే మా పట్టుదల
` మూసీ ప్రక్షాళనతో ముందుకు సాగుతాం
` మరింత సుందర నగరంగా తీర్చిదిద్దుతాం
` ఇంటిగ్రేటెడ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయ శంకుస్థాపనలో రేవంత్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):రాజీవ్‌ గాంధీ వల్లే ఐటీ రంగంలో చాలా మంది రాణిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆనాడు రాజీవ్‌ గాంధీ కంప్యూటర్‌ ను దేశానికి పరిచయం చేశారు.. పీవీ నర్సింహారావు స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ ను మంజూరు చేశారు.. నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి హైటెక్‌ సిటీకి శంకుస్థాపన చేశారని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలుగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాత్ర ఉందని వెల్లడిరచారు. 1994 నుంచి 2014 వరకు హైదరాబాద్‌ను అప్పటి సీఎంలు అభివృద్ధి చేసినట్లు- పేర్కొన్నారు. గూగుల్‌లాంటి ప్రముఖ సంస్థల్లో తెలుగువారు పెద్ద పదవుల్లో ఉన్నారని తెలిపారు. మన ప్రాంత విద్యార్థులు ఇక్కడే చదువు కోవాలని పలు సంస్థలు నిర్మించారని గుర్తు చేశారు. గచ్చిబౌలిలో డిస్టిక్ట్ర్‌ రిజిస్ట్రార్ర్‌, సబ్‌ రిజిస్ట్రార్ర్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆఫీసులకు సీఎం శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. హైటెక్‌ సిటీ కట్టినప్పుడు అవహేళన చేశారు. హైదరాబాద్‌ నగరం సింగపూర్‌, టోక్యోతో పోటీ పడుతోంది. మన వద్ద అన్ని ఉన్నప్పుడు చిత్తశుద్ధితో పనిచేయడం కావాలి. అమెరికాలో మన ఐటీ- నిపుణులు పని చేయడం ఆపేస్తే స్తంభించిపోతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలతో కూడిన ఉద్యోగ భద్రత ఇచ్చాం. రాబోయే పదేళ్లలో వన్‌ బిలియన్‌ డాలర్ల ఎకానవిూగా తీర్చిదిద్దుతాం అన్నారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఎందుకు అడ్డుకుంటున్నారు. మూసీ మురికిలో బతకాలని పేదలు ఎందుకు అనుకుంటారు? తెలంగాణ రైజింగ్‌ 2047తో అభివృద్ధి చేసుకుందాం. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన జరగాలి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సరైన సౌకర్యాలు లేవు. అన్ని సౌకర్యాలతో సబ్‌ రిజిస్ట్రార్ర్‌ కార్యాలయాలు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పిస్తుందోని రేవంత్‌ వెల్లడిరచారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా పరిపాలనకు ఇబ్బంది లేకుండా నిర్మాణం చేపట్టనున్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌ బులిటీలో భాగంగా 30 కోట్లు- ఈ భవన నిర్మాణానికి అపర్ణ కన్సక్ష్రన్‌ కేటాయించిందన్నారు. నిజాం నవాబులు 400 ఏళ్ల చరిత్ర ఉన్న నగరంలో నిర్మించారు.. మాదాపూర్‌, కొండాపూర్‌, వట్టి నాగులపల్లి వరకు అభివృద్ధి చేసేందుకు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో పాటు- పలువురు ముఖ్యమంత్రులు కృషి చేశారు.. ప్రపంచంలోని 500కు పైగా కంపెనీలు ఇక్కడే ఉన్నాయి.. మరోవైపు, చిన్న చిన్న వర్షాలకే హైదరాబాద్‌ నగరం మునిగిపోతుందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన చేస్తామంటే కొందరు వద్దని అంటున్నారు.. ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా.. ప్రపంచానికి ఆదర్శంగా హైదరాబాద్‌ ను నిలుపుకుందామా? అని ప్రశ్నించారు. ప్రపంచం ఆశిస్తున్న స్థాయిలో హైదరాబాద్‌ కు ఇంకా డెవలప్‌మెంట్‌ చేయాల్సి ఉంది.. మనం న్యూయార్క్‌, టోక్యో లాంటి నగరాలతో పోటీ- పడాలి.. చిత్తశుద్ధితో సాధిస్తే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. కాబట్టి, వరిజిబాల్‌ సిటీ-ని గోల్డెన్‌ సిటీ- చేయాలంటే మూసీ ప్రక్షాళన చేసి తీరాలి.. మనకు నదుల ప్రక్షాళన అవసరం.. గంగా, యమున, సబర్మతి నదులను ఆయా రాష్టాలు ప్రక్షాళన చేశాయి.. మనం కూడా మూసీని ప్రక్షాళన చేసుకోవాలన్నారు. పేదల కోసం స్థలాలు వెతకమని మంత్రులకు చెబుతున్నా.. వారికి ఇల్లు కట్టి ఇద్దాం.. సొంత ఇల్లు కళ నెరవేరాలంటే నగరం విస్తరించాలి.. మూసీ విస్తరించాలి.. రాత్రుళ్ళు అక్కడ బిజినెస్‌ నడవాలి.. నైట్‌ ఎకానమిని మూసీలో సృష్టించాలని రేవంత్‌ రెడ్డి సూచించారు. అయితే, గత ముఖ్యమంత్రుల దూరదృష్టితో హైదరాబాద్‌ కి అనేక అంతర్జాతీయ కంపెనీలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌ తెలిపారు. ఇప్పుడు అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీని శాసిస్తున్నాం.. మన వాళ్ళు ఒక్క రోజు పని చేయకపోతే అమెరికా కుప్పకూలిపోతుంది. కాగా, తెలంగాణ రైజింగ్‌ 2047 అంటు-న్నాం.. 2047 నాటికి త్రీ ట్రిలియన్‌ డాలర్‌ ఎకానవిూగా తెలంగాణ ఎదగాలని చెప్పుకొచ్చారు. ఇక, సంవత్సరానికి 15 వేల కోట్ల ఆదాయం ఇచ్చే రిజిస్టేష్రన్‌ శాఖ బంగారు గుడ్డు పెట్టె- బాతు.. లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి రాష్టాన్ర్రికి ఆదాయం తెచ్చి పెడుతున్న వారిని దొంగలుగా చూస్తున్నారు.. నేరం చేసే వాళ్ళ మాదిరిగా రిజిస్టేష్రన్‌ కు వచ్చే వాళ్ళను చూసే పరిస్థితి మారాలని సీఎం సూచించారు. అన్ని వసతులు ఈ ఇంటిగ్రేటెడ్‌ సబ్‌ రిజిస్ట్రార్ర్‌ కార్యాలయాల్లో ఉంటాయని రేవంత్‌ రెడ్డి సూచించారు. ఈ ప్రభుత్వం విూది.. విూకు వసతులు కల్పించడం వల్ల మంచి పేరు వస్తుంది.. 144 సబ్‌ రిజిస్టేష్ర్రన్‌ కార్యాలయాల్లో సంవత్సరానికి 19 లక్షల డాక్యుమెంట్లు- చేస్తున్నాం.. విదేశాల్లో సబ్‌ రిజిస్టేష్ర్రన్‌ కార్యాలయాలకు మంచి పేరు ఉంది.. అన్ని ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేయాలి.. 2034లో ప్రపంచం హైదరాబాద్‌ ను ఫ్యూచర్‌ సిటీగా చూడడానికి రావాలి.. అన్ని విభాగాలు అక్కడి నుంచే పని చేయాలని వెల్లడిరచారు. ఇక, జూన్‌ 2వ తేదీ లోపు 11 ఇంటిగ్రేటెడ్‌ కార్యాలయాలు పూర్తి చేయాలి.. కేవలం 8 నెలల్లోనే అపర్ణ కన్సక్ష్రన్‌ వారు ఇంటిగ్రే-టె-డ్‌ సబ్‌ రిజిస్టేష్ర్రన్‌ ఆఫీసు నిర్మాణం పూర్తి చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌ పేర్కొన్నారు.

రాజీవ్‌ ఆశయాలను ముందుకు తీసుకెళతాం
` రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యం
` రాజీవ్‌కు సీఎం రేవంత్‌ తదితరుల నివాళి
హైదరాబాద్‌(జనంసాక్షి):మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతి సందర్బంగా… సెక్రటేరియట్‌ వద్ద రాజీవ్‌ గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తదితరులు ఘనంగా నివాళి అర్పించారు. రాజీవ్‌ ఆశయాలను ముందుకు తీసుకుని వెళతామని, రాహుల్‌ను ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ ఎంపీలు వీహెచ్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మండలి ఛీఫ్‌ విప్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నారు.