వీరబ్రహ్మేంద్రస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీ లో గల ఆలయంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. తాను స్పీకర్ గా పనిచేసిన రోజుల్లో ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో కూడా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

తాజావార్తలు