జనసంద్రంగా ‘మేడారం’

ఎటు చేసినా జనమయం…
పూర్తిగా రద్దీగా మారిన క్యూలైన్ లు
మంగపేట, మేడారం జనవరి 30 (జనంసాక్షి)మేడారం అంత పూర్తిగా జన సందోహంగా మారిపోయింది. ఎటు చేసినా జనాలతో కిక్కిరిసిన సమ్మక, సారలమ్మల నామాస్మరణతో మార్మోగుతోంది. అమ్మవార్ల దర్శనం కొరకు భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్ లు పూర్తిగా నిండిపోయి భక్తులు సుమారు 2 కిలోమీటర్ల మేర బారులుతీరారు. సమ్మక్క,సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు, అందరు గద్దెపై కొలువుతీరగా భక్తులు అమ్మవార్ల దర్శనం కొరకు భారీగా తరలివస్తున్నారు. అలాగే అమ్మవార్ల లను దర్శించుకోవడం కొరకు రాజకీయ నాయకులు, ప్రముకులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవార్ల లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.



