స్వాతంత్ర సమరయోధుడు గడిపెల్లి రాములు విగ్రహ నిర్మాణ పనులకు భూమి చేసిన మంత్రి శ్రీధర్ బాబు
మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ పరిధిలోని గంగాపురి క్రాస్ రోడ్ వద్ద స్వతంత్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ గడిపెల్లి రాములు విగ్రహ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు. సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనీ తదుపరి స్వాతంత్రం వచ్చిన తర్వాత హుజురాబాద్ మరియు పరకాల నియోజకవర్గాల ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేయడం జరిగిందని . సేవలను మనందరం గుర్తుంచుకోవాలని వారి శ్రేయోభిలాషులు, వారి అభిమానులు, గంగాపురి మంథని ప్రాంతవాసులు, గంగపురి వాస్తవ్యుడిగా వారందరూ స్వర్గీయ మాజీ శాసనసభ్యులు శ్రీరాములు విగ్రహ ప్రతిష్టాపన చేయాలని కోరడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా వారి విగ్రహ నిర్మాణ పనులకు భూమి పూజ చేయడం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.