కొత్త రేషన్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే

 

 

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):భూపాలపల్లి మండలం మంజూనగర్ 9 వార్డులో  పోచమ్మ గుడి, నూతన రేషన్ షాపులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ తో కలిసిభూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీసీ కాలనిలో పోచమ్మ గుడి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టారు.  మైబుపల్లి నూతన రేషన్ షాపు ప్రారంభించి, రేషన్ కార్డులు, బియ్యం పంపిణీ చేసారు.