సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

 

 

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో మంగళవారం నిర్వహించిన సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లి సింగరేణి జీఎం ఆఫీస్ ఆవరణలో జరిగిన వేడుకల్లో స్టూడెంట్స్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న స్టూడెంట్స్ బృందానికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతులమీదుగా మెమొంటోలు అందజేసి, పిల్లలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ లీడర్లు పాల్గొన్నారు.