జర్నలిస్టులపై ఎమ్మెల్యే రేవూరి అనుచిత వ్యాఖ్యలు

నిరసనగా జర్నలిస్టుల రాస్తారోకో.
పరకాల, జనవరి 8 (జనం సాక్షి):పరకాల బస్టాండ్ వద్ద ఆక్రమణలు తొలగింపును పరిశీలించేందుకు గురువారం రోజున ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులతో కలిసి బస్టాండ్ కు వచ్చిన క్రమంలో స్థానిక జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. స్థానిక జర్నలిస్టులు ట్రాఫిక్ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేయగా దురుసు మాటలతో చిందులు వేశారు. జర్నలిస్టులు అయితే ఏంటి ఎవరికి వకల్త పుచ్చుకొని మాట్లాడుతున్నారని ఆగ్రహంతో అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వకాల్తా పుచ్చుకుంటున్నామని చెప్పబోయే ప్రయత్నంలో మళ్లీ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్టులు న్యూస్ కవరేజ్ చేయకుండా బయటికి వచ్చారు ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రజాస్వామికమనీ ,వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం అమరధామంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై ఎమ్మెల్యే రేవూరి నోరు పారేసుకోవడం గర్హనీయం అన్నారు. జర్నలిస్టులు ప్రజల పక్షం అని, ఎమ్మెల్యే ప్రస్తుతం ఎవరి వకల్త పుచ్చుకొని బస్టాండ్ ఆక్రమణల ఇనుప కంచ తొలగించారని జర్నలిస్టులు ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం పరకాల ప్రజల ప్రయోజనాలను ఘనంగా పెడుతూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జర్నలిస్టులపై చిందులు తొక్కుతూ ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కారని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో చోల్లేటి సునేందర్, నేరెళ్ల పరుశురాం, భలే రావు బాబ్జి, రావుల రాజు, కోగిల చంద్రమౌళి, వేణు, గూడేల్లి నాగేంద్ర, కార్తీక్, విజయ్, శ్రీనివాస్ రెడ్డి, చిర్ర సతీష్, సత్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



