వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీలో గల మద్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో వీరబ్రహ్మేంద్రస్వామి ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించగా, ఎమ్మెల్యే హాజరయ్యారు. కాగా ఆలయ అర్చకులు, భక్తులు ఘన స్వాగతం పలికి, నుదుట తిలకం పెట్టి, శాలువాతో సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ ఈ దేవాలయం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.