మల్టీపర్పస్ వర్కర్ టు గ్రామ ఉపసర్పంచ్

చెన్నారావుపేట, డిసెంబర్ 11 (జనం సాక్షి):
అమృతండా గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన బోడ సంపత్….
మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్న అమృతండా గ్రామానికి చెందిన బోడ సంపత్ గ్రామ ఉపసర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గత కొద్ది సంవత్సరాలుగా బోడ సంపత్ అమృతండా గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ (కరోబార్) గా పనిచేస్తున్నాడు. రెండవ సాధారణ ఎన్నికలలో 5వ వార్డు సభ్యుడిగా నామినేషన్ వేసి తోటి వార్డు సభ్యుల మద్దతుతో అటు వార్డు సభ్యుడిగా, ఇటు గ్రామ ఉపసర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తూ 5వ వార్డు సభ్యుడిగా, ఉపసర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల గ్రామస్తులు, పలువురు సంపత్ ను అభినందించారు.


