చెన్నారావుపేట సర్పంచ్ అభ్యర్థి బ్యాలెట్ నమూనా పై అభ్యంతరం

 

 

 

 

 

చెన్నారావుపేట, డిసెంబర్ 13(జనం సాక్షి):

జిల్లా కలెక్టర్, డిపిఓ, మండల ఎన్నికల అధికారులకు ఫిర్యాదు…

ఈనెల 17న జరగనున్న రెండవ సాధారణ ఎన్నికలలో భాగంగా చెన్నారావుపేట గ్రామ సర్పంచ్ బ్యాలెట్ నమూనాపై బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సత్య శారద, జిల్లా పంచాయతీ అధికారి కల్పన, మండల ఎన్నికల అధికారి, ఎంపీడీవో వెంకట శివానంద్ లకు అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేశారు. బ్యాలెట్ ను క్రమ పద్ధతిలో సీరియల్ గా పాత నమూనా ప్రకారం సింగిల్ కాలంలో అభ్యర్థుల గుర్తులు వచ్చే విధంగా కాకుండా అభ్యర్థుల గుర్తులను ఓకే బ్యాలెట్ లో డబుల్ కాలంలో ముద్రించడం జరిగిందన్నారు. కావున ఓటర్లు స్వస్తిక్ ముద్ర ద్వారా ఓటు వేస్తే ఇతర అభ్యర్థికి ఓటు పడే అవకాశం ఉందన్నారు. అట్టి బ్యాలెట్ నమూనాను మార్చి పాత పద్ధతిలో అభ్యర్థుల గుర్తులను సీరియల్ కాలంగా వచ్చే విధంగా చూసి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కుండె మ్మల్లయ్య, హంస విజయరామరాజు, జున్నుతుల మహేందర్ రెడ్డి, కుసుమ నరేందర్, తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంపై మండల ఎన్నికల అధికారి, ఎంపీడీవో వెంకట శివానంద్ ను వివరణ కోరగా ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ జిల్లా కలెక్టర్, డిపిఓ ల ద్వారా వచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, డిపిఓ ల దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు.