సదాశివపేటలో హిందూ సంఘాల నిరసన ర్యాలీ

 

 

 

 

 

 

 

సదాశివపేట డిసెంబర్ 24(జనం సాక్షి)బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులకు నిరసనగా సదాశివపేటలో బుధవారం హిందూ సంఘాలు భారీ ర్యాలీ చేపట్టారు. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, సంగ్ పరివార్, బిజెపి అనుబంద సంస్థలు, హిందూ పరిరక్షణ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ ప్రభు మందిరం నుండి గాంధీ చౌక్ మీదిగా పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక బస్టాండ్ వద్ద బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులపై తక్షణమే మారణకాండ నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు, పట్టణ పుర ప్రముఖులు, యువకులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.