రాష్ట్రమంతటా విస్తరించిన నైరుతి

` పలు జిల్లాల్లో రానున్న రోజుల్లో వర్షాలు
హైదాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. నాసిక్‌, నిజామాబాద్‌, సుకుమా, విజయనగరం, ఇస్లాంపూర్‌ వరకు విస్తరించనున్నాయి రుతుపవనాలు.నైరుతి రుతుపవనాల విస్తరణ నేపథ్యంలో తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోవిూటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్టాల్ల్రో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇక రానున్న ఐదు రోజుల పాటు ఈ రాష్టాల్ల్రోఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.దీంతో.. రుతుపవనాలు వేగంగా విస్తరించడం, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ ప్రభుత్వం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌ నగర్‌ నాగర్‌ కర్నూల్‌, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, నారాయణపేట్‌, జోగులాంబ గద్వాల, హైదరాబాద్‌ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30`40 కి.విూ వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా.. హైదరాబాద్‌లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ ప్రకటించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీని 040`21111111, 9001136675 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఇక ఏపీలో కూడా కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ.. రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రెండు రాష్టాల్ల్రోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక తెలంగాణలో పగటిపూట 27 నుంచి 36 డిగ్రీల సెల్సియస్‌ నమోద వుతుంది. ఏపీలో 27 నుంచి 35 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతోంది. తెలంగాణలో సోమ, మంగళవారాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్గాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.