రేవంత్‌ సర్కార్‌ మళ్లీ ఆనాటి రోజులు తెచ్చింది

 

 

 

 

 

 

ఆగష్టు 12(జనం సాక్షి)రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ చోట చెప్పులు లైన్లో పెడితే మరోచోట ఆధార్ కార్డులు ఇంకో చోట పట్టాదార్ పాస్‌బుక్కులు ఉంచుతున్నారని.. ఎండలేదు, వాన లేదు, తెలంగాణలో ఏ మూలకు పోయినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయని తెలిపారు.కోడికూయక ముందే రైతన్న ఎరువుల దుకాణం ముందు క్యూ కడుతున్నాడని తెలిపారు. ఒక్క బస్తా కోసం పడిగాపులు గాస్తున్నాడని పేర్కొన్నారు. పదేళ్లలో ఎన్నడన్నా చూసినమా ఇంతటి దైన్యం ఉందా అని ప్రవ్నించారు. తెలంగాణలో మళ్లీ “ఆనాటి రోజులు” తెచ్చింది అసమర్థ రేవంత్ సర్కారు అని మండిపడ్డారు.ముందుచూపు కరువై, అన్నదాతను అరిగోసలు పెడుతోందని విమర్శించారు.