గ్లోబల్‌ కాపిటల్‌గా తెలంగాణ

` సమ్మిట్‌లో రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు
` క్యూ కట్టిన కార్పొరేట్‌ కంపెనీలు
` రెండు రోజుల్లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు
` ఫుడ్‌ ప్రాసెసింగ్‌ డేటాసెంటర్లు
` ఫార్మా సెక్టార్‌ క్లీన్‌ ఎనర్జీలో భారీ ప్రాజెక్టులు
` స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం సాధించేలా విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాం
` మారుమూల గ్రామంలోని రైతు కుటుంబం నుంచి వచ్చా..
– పేదలు, రైతుల సమస్యలు నాకు బాగా తెలుసు
– విజన్‌-2047 డాక్యుమెంట్‌ లో సీఎం రేవంత్‌ రెడ్డి
` ఆసియాకు ఇన్నోవేషన్‌ క్యాపిటల్‌గా తెలంగాణ: భట్టి విక్రమార్క
` ఫ్యూచర్‌ సిటీలో త్వరలోనే యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో రెండో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వారితో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు పెంపునకు వచ్చిన భారీ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడనున్నాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌, డేటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్‌ ఎనర్జీ, ఎలక్టాన్రిక్స్‌ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.ఇన్‌ఫ్రాకీడిసి పార్క్స్‌ 150 ఎకరాల్లో 1గిగావాట్‌ సామర్థ్యం గల భారీ డేటా పార్క్‌ అభివృద్ధి చేపట్టుందుకు రూ. 70 వేల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. జెసీకేఇన్ఫా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ రూ.9 వేల కోట్ల పెట్టుబడితో పెద్ద స్థాయి డేటా సెంటర్ల నిర్మాణం చేపడుతోంది. దీంతో సుమారు 2 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏజీపీ గ్రూప్‌ మొత్తం రూ.6,750 కోట్ల పెట్టుబడితో 1గిగావాట్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ (బీఈ) టీకాలు, పరిశోధన`అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా రూ.3,500 కోట్ల కొత్త పెట్టుబడి ప్రకటించింది. గత పెట్టుబడితో కలిపి మొత్తం రూ.4 వేల కోట్లు అవుతుంది. 3 వేలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి.ఫెర్టిస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.2 వేల కోట్ల పెట్టుబడితో తెలంగాణలో అధునాతన ఆహారం వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీంతో 800 పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్థిర వ్యవసాయానికి అవసరమైన పోషకాలు, బయో ఉత్పేర్రకాలు తయారీకి రూ.200 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించారు.వింటేజ్‌ కాఫీ అండ్‌ బెవరేజెస్‌ లిమిటెడ్‌ ఫ్రీజ్‌డ్రైడ్‌ కాఫీ ప్లాంట్‌ స్థాపనకు రూ.1,100 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వెయ్యి మంది వరకు ఉద్యోగావకాశాలు లబించనున్నాయి. రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే యూనిట్‌ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఎలక్టాన్రిక్‌ తయారీ సేవల విస్తరణలో కేన్స్‌ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్‌ రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదించింది.ఆర్సీసీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మూడు విడతల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 1,600 కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.పర్వ్యూ గ్రూప్‌ 50 మెగావాట్ల సామర్థ్యం గల గ్లోబల్‌ కెపాసిటీ, ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా 3 వేల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది.అరబిందో ఫార్మా రూ.2 వేల కోట్లతో విస్తరణ చేపట్టి 3వేలకి పైగా ఉద్యోగాలు సృష్టించనున్నారు.హెటెరో సంస్థ మందుల తయారీ యూనిట్ల విస్తరణకు రూ.1,800 కోట్ల పెట్టుబడి ప్రకటించింది. దీంతో 9వేలకి పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు సృష్టించనున్నారు.గ్రాన్యూల్స్‌ ఇండియా రూ.1,200 కోట్ల పెట్టుబడితో 2,500?3 వేల మందికి ఉపాధి కల్పించనుంది. భారత్‌ బయోటెక్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు చేస్తోంది. దీంతో 200లకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆహార పానీయాల తయారీ విస్తరణలో కేజేఎస్‌ ఇండియా రూ.650 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఈ యూనిట్‌ ద్వారా 1,551 మందికి ఉపాధి దొరకనుంది. గోద్రెజ్‌ ఇండస్టీస్ర్‌ గ్రూప్‌ రాష్ట్రంలో పాల ఉత్పత్తి విస్తరణకు రూ.150 కోట్ల పెట్టుబడితో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్‌ ద్వారా 300 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఆక్వెలాన్నెక్సస్‌ లిమిటెడ్‌ తెలంగాణలో క్లీన్‌ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్‌ జీరో ఉద్గారాల డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తోంది. పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల భారీ పెట్టుబడులు రానున్నాయి ప్రత్యక్షంగా 10 వేల మందికి,పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనుంది. ఫుడ్‌ లింక్‌ ఎఫ్‌అండ్‌బీ హోల్డింగ్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.3,000 కోట్లు పెట్టుబడులతో ముందుకొచ్చింది. డ్రీమ్‌వాలీ గోల్ఫ్‌ అండ్‌ రిసార్ట్స్‌ రూ.1,000 కోట్లతో నిర్మించనున్నారు. సారస్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అట్మాస్ఫియర్‌ కోర్‌ హోటల్స్‌ (మాల్దీవులు) రూ.800 కోట్లు, కేఈఐ గ్రూప్‌ (కామినేని గ్రూప్‌) రూ.200 కోట్లు, పోలిన్‌ గ్రూప్‌ (టర్కీ), మల్టీవర్స్‌ హోటల్స్‌ రూ.300 కోట్లు, ఫ్లుడ్రా ఇండియా (స్పెయిన్‌) రూ.300 కోట్లు, శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ రూ.300 కోట్లు, రిధిరా గ్రూప్‌ రూ.120 కోట్లు, సలామ్‌ నమస్తే దోసా హట్‌ (ఆస్టేల్రియా), విశాఖ రిక్రియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.25 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ యానిమేషన్‌ ఐఫా ఉత్సవం, ఏథెన్స్‌ ఈవెంట్ల భాగస్వామ్యం ద్వారా రాష్టాన్రికి రూ.5,50,600 కోట్ల ఆర్థిక లాభం చేకూరనుంది. టిడబ్ల్యూఐ గ్రూప్‌ ప్రపంచంలోనే తొలి ప్లగ్‌`ఇన్‌ హైబ్రిడ్‌ మోటార్‌బైక్‌ తయారీ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు. రూ.1,100 కోట్లు పెట్టుబడితో 500 మందికి ఉద్యోగాల కల్పన అవకాశాలు రానున్నాయి. మహీంద్రా అండ్‌ మహీంద్ర జహీరాబాద్‌ యూనిట్‌ విస్తరణకు నాలుగేళ్లలో రూ.500 కోట్లకు పైగా పెట్టుబడికి ముందుకొచ్చింది. ఇండియా ఎక్స్‌ ట్రీమ్‌ అడ్వెంచర్‌20 ఎకరాల్లో ఎక్స్‌ ట్రీమ్‌ స్పోర్ట్స్‌, అడ్వెంచర్‌, ఈ`స్పోర్ట్స్‌ అరేనా. మొత్తంగా రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టింది. బయోవరంటిష్యూ ఇంజినీరింగ్‌, రెజెనరేటివ్‌ మెడిసిన్‌, సెల్‌?జీన్‌ థెరపీకి ప్రత్యేక కేంద్రం రూ. 250 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. జ్యూరిక్‌ ఇన్షూరెన్స్‌ ఇండియాలో తొలి గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్‌ (ఉఅఅ) కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంది. మూడేండ్లలో దశలవారీగా విస్తరించనున్నారు. కెనడియన్‌ ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ తమ తొలి భారతీయ సంస్థను హైదరాబాద్‌లో స్థాపించ నున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ సైబర్‌ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్క్యంగా పేర్కొంది. మాక్సిమస్‌ (అమెరికా) గ్లోబల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ టెక్నాలజీఆపరేషన్స్‌ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. జీఎంఆర్‌ స్పోర్ట్స్‌ ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్ట్‌ లో భాగంగా శాటిలైట్‌ స్పోర్ట్స్‌ సిటీ అభివృద్ధి చేయనున్నారు. అనలాగ్‌ ఏఐ (అలెక్స్‌ కిప్‌మాన్‌) హైదరాబాద్‌లో గ్లోబల్‌ పరిశోధన ప్రోటోటైపింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఆల్ట్‌ మిన్‌ బ్యాటరీ ముడి పదార్థాల తయారీ కేంద్రం ప్రతిపాదించారు. అజయ్‌ దేవగన్‌ ఫిల్మ్‌ స్టూడియోలో స్టూడియోలు, వీఎఫ్‌ ఎక్స్‌, వర్క్‌ షాప్‌లు వంటి ఫిల్మ్‌ ఎకోసిస్టమ్‌నుపీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయనున్నారు. దీంతో యువతకు ఉపాధి అవకావాలు పెరగనున్నాయి. తెలంగాణ,యూఏఈ,ఆఫ్రికా పెట్టుబడి భాగస్వామ్యాల కోసం చర్చించారు. బహుళరంగ పెట్టుబడి డెస్క్‌ ఏర్పాటుకు ఎంఓయూ చేసుకునేందుకు పరిశీలించారు.బ్లాక్‌స్టోన్‌ ఆసియా డేటా సెంటర్లు, లాజిస్టిక్స్‌ పార్కులు, కమర్షియల్‌ స్పేస్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. సత్త్వ గ్రూప్‌ సమగ్ర పట్టణ అభివృద్ధి, స్టూడెంట్‌?సీనియర్‌ లివింగ్‌ ప్రాజెక్టులపై చర్చించారు.బ్రిగేడ్‌ గ్రూప్‌ సమగ్ర టౌన్‌షిప్‌ ప్రతిపాదనపై చర్చ. ఫ్యూచర్‌ సిటీలో ల్యాండ్‌ అలాట్మెంట్‌పై ప్రభుత్వం ఆసక్తి కనబరిచింది.సుమధుర గ్రూప్‌ కొత్త టౌన్‌షిప్‌, మధ్యతరగతి నివాస సముదాయాల ప్రతిపాదించారు. విజ్జీ హోల్డింగ్స్‌ మల్టీ ఒమిక్స్‌, డిజిటల్‌ ట్విన్‌, ప్రిసిషన్‌ హెల్త్‌ పరిశోధన కోసం ఆధునిక కేంద్రం ప్రతిపాదించారు. ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్లు ఫిఫా ఏఐఎఫ్‌ఎఫ్‌ ఫుట్‌బాల్‌ అకాడవిూ టాలెంట్‌ అభివృద్ధికి ప్రపంచ స్థాయి అకాడవిూ హైదరాబాద్‌లో స్థాపించనున్నారు. తెలంగాణను గ్లోబల్‌ హాకి హబ్‌ గా మార్చేందుకు హాకీ మహిళల వరల్డ్‌ కప్‌ క్వాలిఫైయర్‌ 2026ను 8 దేశాలు పాల్గొనే అంతర్జాతీయ పోటీని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. 18 దేశాలు పాల్గొనే ఏషియారోయింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 2026 నిర్వహించనున్నారు.హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ చెస్‌ ఫెస్టివల్‌ 2026 ప్రపంచంలోనే అతిపెద్ద చెస్‌ ఉత్సవం కానుంది.
స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం సాధించేలా విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాం : సీఎం రేవంత్‌ రెడ్డి
తెలంగాణ చైతన్యవంతమైన నేల అని సీఎం రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం సాధించేలా ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047’ డాక్యుమెంట్‌ రూపొందించినట్లు తెలిపారు. గ్లోబల్‌ సమిట్‌ ముగింపు వేడుకలో ప్రసంగిస్తూ 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా ఎదగాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు వెల్లడిరచారు. అన్ని వర్గాలవారిని సంప్రదించి పేదలు, రైతులు, వ్యాపారులు, యువతకు అభివృద్ధి ఫలాలు దక్కేలా విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 డాక్యుమెంట్‌ సీఎం రేవంత్‌ తరెడ్డి ఆవిష్కరించారు. డాక్యుమెంట్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఆనంద్‌ మహీంద్ర, చిరంజీవి, దువ్వూరి సుబ్బారావు పాల్గొన్నారు.తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌లో రికార్డుస్థాయిలో ఒప్పందాలు జరిగాయి. సమిట్‌ రెండురోజుల్లో కలిపి మొత్తం రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ కంపెనీలు, పరిశ్రమలు ప్రభుత్వంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్‌? సిటీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైజింగ్‌? గ్లోబల్‌? సమిట్‌? ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపాయి. వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్‌?రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపారు. ఆయన సమక్షంలో పలు కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఇప్పటి వరకు రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
భారీగా ఉద్యోగాలు వచ్చేలా ఫ్యూచర్‌ సిటీని తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. నెట్‌ జీరో కార్బన్‌ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌లో నిర్వహించిన సెషన్‌లో ఆయన మాట్లాడారు. దేశ ఎకానమీ చరిత్రలో లేని అత్యంత భారీ లక్ష్యాన్ని 2047 కోసం నిర్దేశించుకున్నామని, తెలంగాణను ఇన్నోవేషన్‌ క్యాపిటల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.

పలు కంపెనీలు, పరిశ్రమలతో ఒప్పందాలు:
ఫుడ్‌ అండ్‌ ఎఫ్‌ఎంసీజీ తయారీ యూనిట్‌కు ఆర్‌సీపీఎల్‌ ఒప్పందం
ఎలక్ట్రానిక్స్‌ కాంట్రాక్ట్‌ మ్యానుఫాక్చరింగ్‌ సేవల విస్తరణకు కైన్స్‌ టెక్నాలజీ ఒప్పందం
రూ.9 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో జేసీకే ఇన్‌ఫ్రా ఒప్పందం
మూడు దశల్లో ఆర్‌సీటీ ఎనర్జీ ఇండియా రూ.2,500 కోట్ల పెట్టుబడులు
50 మెగావాట్ల క్లీన్‌ ఎనర్జీ డేటా సెంటర్‌కు అక్వైలోన్‌ నెక్సస్‌ ఒప్పందం
హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ క్యాంపస్‌కు ఏజీపీ గ్రూప్‌ ఒప్పందం
రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఏఐ-రెడీ డేటా పార్క్‌
ఫార్మాస్యూటికల్‌ ఫార్ములేషన్స్‌ యూనిట్లు ఏర్పాటు చేయనున్న హెటెరో గ్రూప్‌
రాష్ట్రంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అరబిందో ఫార్మా
పెప్టైడ్స్‌ తయారీ అండ్‌ ఆంకాలజీ సీడీఎంవో యూనిట్‌ పెట్టనున్న గ్రాన్యూల్స్‌ ఇండియా
వ్యాక్సిన్‌, ఆర్‌అండ్‌డీ, సీడీఎంవో విస్తరణకు బయోలాజికల్‌-ఈ ఒప్పందం
రెండోరోజు పర్యాటకరంగంలో రూ.11,395 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

2. ప్రతి కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి
` రాష్ట్ర ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చింది
` అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను గ్లోబల్‌ సమ్మిట్‌ వేదిక నంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఫ్యూచర్‌ సిటీలోని గ్లోబల్‌ సమిట్‌ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో రూ.5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 18 అడుగుల ఎత్తుతో విగ్రహాల నిర్మాణం జరిగింది.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…‘‘తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ జరగడం ఆనందంగా ఉంది. 2009లో ఇదే రోజు (డిసెంబర్‌ 9) తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. 6 దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చింది. ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ తల్లిని తలుచుకుని పనులు మొదలు పెట్టేందుకే విగ్రహాలు ఆవిష్కరించాం. స్వరాష్ట్ర కల నిజమై.. సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం నంబర్‌ వన్‌గా రూపొందుతోంది. సోనియా గాంధీ ఎన్నో అడ్డంకులు అధిగమించి మరీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు.ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ జన్మదినం డిసెంబరు 9న కావడం మా అందరికీ సంతోషాన్ని కలిగించే పర్వదినం. ఏటా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతో పాటు, సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలను తెలంగాణ ప్రజలు నిర్వహించుకుంటారు. మా పథకాలు, కార్యక్రమాల్లో సోనియా, మన్మోహన్‌ స్ఫూర్తి కొనసాగుతోంది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

ఫ్యూచర్‌ సిటీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
` సినీ ప్రముఖులతో భేటీలో సిఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): స్క్రిప్ట్‌తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని టాలీవుడ్‌ ప్రముఖలకు సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్యూచర్‌ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2025లో మంగళవారం సీఎం రేవంత్‌ రెడ్డితో టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సినీ ఇండస్టీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఫ్యూచర్‌ సిటీలో స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా వారికి సీఎం వివరించారు. 24 క్రాప్ట్స్‌లో సినిమా ఇండస్టీ అవసరాలకు అనుగుణంగా స్థానికులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని వారికి సీఎం రేవంత్‌ సూచించారు. ఫ్యూచర్‌ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా వారికి సీఎం రేవంత్‌ వివరించారు. సీఎం రేవంత్‌తో సమావేశమైన వారిలో చిరంజీవి, అజయ్‌ దేవగన్‌ అల్లు అరవింద్‌, సురేష్‌ బాబు, దిల్‌ రాజు, నటులు జెనీలియా, అక్కినేని అమలతోపాటు పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు ఉన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సోమవారం ప్రారంభమైన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2025 నేటితో అంటే.. మంగళవారంతో ముగియనుంది.