ఘనంగా సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలు

శంకరపట్నం జనవరి 3 (జనంసాక్షి)
–సంఘ సంస్కర్త, చదువుల తల్లి కీర్తిని కొనియాడిన
బీసీ సంఘం మండల అధ్యక్షులు
అభిలాష్ గౌడ్ బొంగోని
ముఖ్య అతిథిలుగా పాల్గొన్న సర్పంచ్ గోదారి రాజేంద్ర ప్రసాద్, ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్
దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, దేశంలో పాఠశాలలు నిర్మించి విద్యను అందించిన చదువుల తల్లి సంఘ సంస్కర్త అయిన సావిత్రి బాయ్ ఫూలే 195వ జయంతి వేడుకలు శంకరపట్నం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 180ఏండ్ల క్రితం విద్యవిప్లవ క్రాంతి “సావిత్రిబాయి పూలే” వేసిన విద్య పునాదులే నేటి స్త్రీ స్వేచ్ఛకి ప్రధాన కారణం..!కులమతాల పేరుతో తరతరాలుగా అణచివేతకు గురైన నిమ్నజాతి ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అర్దాంగి సావిత్రిబాయి పూలే.
మహిళల సాధికారతకు నిలువెత్తు రూపం సావిత్రిబాయి పూలే అని, భారతదేశంలో మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకునేందుకు ఆమె పాఠశాలలు ప్రారంభించి తన భర్తతో కలిసి సత్యశోధక సమాజాన్ని స్థాపించి బాల్య వివాహాలు మూఢనమ్మకాలను నిర్మూలన రూపుమాపటం, వితంతు పునర్వివాహం కోసం శ్రమించారని పెర్కొన్నారు. ఆమహనీయురాలి జయంతి సందర్భంగా స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గజ్జెలి హనుమంతు, ముత్తారం ఉపసర్పంచ్ గట్టు శ్రావణ్, వార్డ్ మెంబెర్ పంజాల సంపత్, నాయకులు గోడిశాల తిరుపతి, బీసీ సంఘం నాయకులు బొంగోనిశ్రావణ్, కొత్తపల్లి అశోక్, గడ్డం శ్రీకాంత్, ఎండి షారుఖ్ తదితరులు పాల్గొన్నారు.


