శంకరపట్నం: కవ్వంపల్లికి కీలక పదవి.. కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

శంకరపట్నం జనవరి 07 (జనంసాక్షి):మానకొండూరు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణను టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంపై శంకరపట్నంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బొజ్జ చంద్రమౌళి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బస్వయ్య, హుజురాబాద్ ఏఎంసి వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, కొత్తగట్టు ఆలయ కమిటీ చైర్మన్ కోరెం రాజిరెడ్డి, సర్పంచులు దుర్గపు సుజాత, ఊకంటి మాధవి, ఉప సర్పంచ్ గొట్టే మధు, నాయకులు ఊకంటి మధుకర్, దుర్గపు తిరుపతి, ఆరిఫ్, ప్రవీణ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.


