రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కి ఎంపికైన సిద్ధార్థ విద్యార్థిని…

 

 

చెన్నారావుపేట, డిసెంబర్ 1 (జనం సాక్షి):

అభినందించిన సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కంది గోపాల్ రెడ్డి…

మండల కేంద్రంలోని సిద్ధార్థ గురుకుల హై స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న పల్లకొండ శ్లోక అనే విద్యార్థిని రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కు ఎంపికైనట్లు సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కంది గోపాల్ రెడ్డి సోమవారం తెలిపారు. ఇటీవల వరంగల్ జిల్లా కేంద్రంలోని తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో శ్లోక ప్రదర్శించిన ధాన్యం బస్తాలను తక్కువ సమయంలో యంత్రంతో నింపే పద్ధతి అనే అంశం కు జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈ నెలలో రంగారెడ్డి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. అలాగే పాఠశాలకు చెందిన యాసం అనన్య ద్వితీయ బహుమతి, బోడ వేణు తృతీయ బహుమతి సాధించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో విద్యార్థులతో పాటు గైడ్ టీచర్ దామర గణేష్ ను ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అండెం కరుణాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.