మెహర్ నగర్ సర్పంచ్ గా సిలువేరు లక్ష్మయ్య బాధ్యతలు స్వీకరణ

భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 23 (జనం సాక్షి): మండల పరిధిలోని మెహర్ నగర్ గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌గా సిలువేరు లక్ష్మయ్య సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలను అధికారికంగా చేపట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సిలువేరు లక్ష్మయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలందరి సహకారంతో మెహర్ నగర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నూతన సర్పంచ్‌ను నాయకులు, గ్రామస్తులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.



