పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న శ్రీనుబాబు
కమాన్ పూర్ : మంథని నియోజక వర్గం పరిధిలోని కమాన్ పూర్ మండలం లింగాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆదివారం మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీనుబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్మాణ కర్తలు మాజీ సర్పంచ్ సాగి శ్రీధర్ రావు, సాయి శ్రీనివాసరావు విగ్రహ దాత తాళ్ల శేఖర్ లను శ్రీని బాబు సన్మానించారు. పోచమ్మ తల్లి దీవెనలతో మంథని నియోజకవర్గ ప్రజలందరూ క్షేమంగా, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో కలకాలం ఉండాలని శీను బాబు ఆకాంక్షించారు. ఆయన వెంట అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.