కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కమాన్ పూర్ మండలంలోని సిద్దిపల్లె, పెంచికల్ పేట్, నాగారం, రొంపకుంట, గొల్లపల్లి, గుండారం, సుందిళ్ల, చందనాపూర్ గ్రామాల్లో పీ.ఏ.సీ.ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి దాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం పీ.ఏ.సీ.ఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. . ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో వరి దాన్యం విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందాలని కోరారు. తక్కువ ధరకు దళారులకు దాన్యం అమ్ముకుని నష్టపోవద్దని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సెక్రటరీ తిమ్మరాజు సంతోష్ కుమార్, డైరెక్టర్లు, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.

తాజావార్తలు