కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
మంథని, (జనంసాక్షి) : ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, రైతులందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కమాన్ పూర్ మండల తాసిల్దార్ వాసంతి, ఎంపీడీవో లలిత, ఏపీఎం శైలజ శాంతి లు కోరారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం లోని రాజాపూర్, గుండారం, పేరపల్లి, కమానపూర్, సిద్దిపల్లి, ముల్కలపల్లి గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి సీసీలు శ్రీనివాస్, ఎల్లమ్మ, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, హమాలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.