పల్లె గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

బూర్గంపహాడ్   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (జనంసాక్షి) : పల్లె గ్రామాలు అభివృద్దే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బూర్గంపహాడ్ మండలం గౌతమీపురం ఆర్ అండ్ బి రోడ్డు నుండి సోంపల్లి జెడ్ పి రోడ్డు వరకు సుమారు 90 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న బిటీ రోడ్డు పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తో కలిసి శుక్రవారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల పల్లె గ్రామాలు అభివృద్దే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదని ప్రతి ఒక్క నిరుపేదకు రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా అధికారులు, మండల అధికారులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, సొసైటీ మాజీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీపురం మాజీ ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, పీసీసీ సభ్యులు తాళ్లూరి చక్రవర్తి, మాజీ జడ్పిటిసి బట్టా విజయ్ గాంధీ, నియోజకవర్గ నాయకులు బాదం రమేష్ రెడ్డి, కైపు శ్రీనివాస రెడ్డి, మందా నాగరాజు, భజన ప్రసాద్, బి బ్లాక్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.