భక్త జన గుడారం…. దేవతల మేడారం..!

వానమంతా భక్త సంద్రోహం..
సుమారు కోటికి పైగా భక్తులు హాజరు..
మంగపేట, మేడారం జనవరి 29 (జనంసాక్షి)
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైనా తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు భక్తులు గురువారం నాటికి సుమారు కోటి మందికి పైగా హాజరైనట్లు అధికారులు అంచన వేశారు. తాడ్వాయి నుంచి కన్నెపల్లి, ఊరట్టo, రెడ్డిగూడెం, కొత్తూరు, నార్లాపురం, పాడిగాపురం, వెంగ్లాపురం తదితర గ్రామాల చివరి వరకు భక్తజనం గూడారాలు వేసుకొని కుటుంబ సభ్యులు, బందుమిత్రులతో సేద తీరారు. జoపన్న వాగులో జలకాలాట ఆడి వనదేవతలను పోటీపడి దర్శించుకోవడంతో హాజరు కావడంతో ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసి పోయింది. అధికారులు భక్తులను చేయడతో భక్తులు కొంత అసహనం వ్యక్తం చేయడం కన్పించింది. దైవ దర్శనాల అనంతరం వనం నిండా జనమే కన్పిoచినది. వన దేవత లైన సారలమ్మ కన్నెపల్లి నుంచి. పగిడిద్దరాజు పూనుగొండ్ల గోవిందరాజులు ఏటూరునాగారం మండలంలోని కొండాయి నుంచి, జంపన్న వాగు నుంచి జంపన్న, నాగులమ్మ దేవతలు బుధవారం రాత్రి గద్దెలపై కొలువుధీరారు. గురువారం రాత్రి చిలుకల గట్టు నుంచి శ్రీ సమ్మక్క తల్లి వస్తున్న తరుణంలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ఎడ్ల బండ్లు, కాలినడకన భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలు మొత్తం భక్తులతో కిక్కిరిసి పోయింది.



