అందరి సహకారంతో గ్రామం అభివృద్ధి చేస్తా

బచ్చన్నపేట జనవరి ( జనం సాక్షి):అందరి సహకారంతో విఎస్ఆర్ నగర్ గ్రామం అభివృద్ధి చేస్తానని విఎస్ఆర్ నగర్ గ్రామ సర్పంచ్ గోడుగు రేణుక కమలకర్ అన్నారు.సోమవారం విఎస్ఆర్ నగర్ గ్రామపంచాయతిలో పంచాయతీ కార్యదర్శి రూబినసూల్తాన ఆద్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలతొ పలు సమస్యలు గురించి చర్చించారు అనంతరం గ్రామ సర్పంచ్ గొడుగు రేణుక కమలకర్ మాట్లాడుతూ ప్రజలందరి సహకారంతో గ్రామం అభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా నా దృష్టికి తిసుకొని వచ్చి సమస్య పరిష్కారం చేసుకోవాలిని కొరారు.గ్రామ అభివృద్ధిలో పాలుపంచు కోవాలని అందరి సహకారంతో అభివృద్ధి చేసుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉత్కం వెంకట్రాం. సంతోష,వార్డు సభ్యులు బోడ్డు యాదయ్య, చావన్ జెహింద్,చింతల శ్రీనివాస్,పుట్ట మహేష్,అంగన్వాడి టిచర్ హజీర, గ్రామస్థులు గోడుగు కనకరావు. పండుగ సుదకర్,వంగ సురేందర్ రెడ్డి,వెంకట్డాం చంద్రమౌళి,సనాది రామచంద్రం,బండి సంజీవరెడ్డి,గోడుగు నవీన్,చావన్ పరమేష్ ,కాలియా బుచ్చాలు,రిపోష్ తదితరులు పాల్గొన్నారు



