అమీనాబాద్ లో చోరీ…!

 

 

 

 

 

 

 

 

 

రూ. 6 వేల విలువ చేసే వస్తువుల అపహరణ..

చెన్నారావుపేట, జనవరి 10:( జనం సాక్షి ): మండలంలోని అమీనాబాద్ గ్రామంలో చోరీ జరిగిన సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం… ఇదే గ్రామానికి చెందిన కాట్ల రాములు కు చెందిన కిరాణం షాపు వెనకాల ఉన్న రేకులను శుక్రవారం అర్ధరాత్రి వేళలో గుర్తుతెలియని దుండగులు తొలగించి లోనికి చొరబడ్డారు. లోపల ఉన్న రూ. 3 వేల నగదు, సిగరెట్ ప్యాకెట్లు, మద్యం బాటిల్లు, బనీన్లు, డ్రాయర్లు సుమారు రూ. 3 వేల విలువ చేసే వస్తువులు మొత్తం రూ. 6 వేల విలువచేసే వస్తు సామాగ్రిని అపహరించుకుపోయారు. రోజువారి మాదిరిగానే శనివారం ఉదయం కిరాణం షాపు వద్దకు వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు బాధితుడు కాట్ల రాములు చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు