జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై..

 

 

 

 

డిసెంబర్ 3న మహా ధర్నా విజయవంతం చేయండి.. అబ్దుల్ రహీం.

గంభీరావుపేట డిసెంబర్ 01 (జనం సాక్షి):

రాజన్న సిరిసిల్ల జిల్లా పేట మండలంలో రాష్ట్ర ఆదేశాల మేరకు జర్నలిస్టు సమస్య పరిష్కారం కొరకై ఈనెల 3న జరగబోయే మహా ధర్నా విజయవంతం చేయాలని మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం పిలుపునిచ్చారు, ఆయన మాట్లాడుతూ,
జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ,మన డిమాండ్లు:అక్రెడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించి కొత్త కార్డులు జారీ చేయాలి.
ఆరోగ్య బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి.
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు మంజూరు చేయాలి.
వృత్తి కమిటీలు వెంటనే ఏర్పాటు చేయాలి.
సంక్షోభంలో ఉన్న చిన్న మధ్యతరగతి పత్రికలను ఆదుకోవాలి డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అబ్దుల్ రహీంతో పాటు, మాజీ అధ్యక్షులు,పాప గారి యాదగిరి గౌడ్, ఎర్ర శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అర్జున్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరిగే రమేష్, సంయుక్త కార్యదర్శి పల్లె శ్రీనివాస్, కోశాధికారి సిరిపురం ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు, సంతోచారి, షబ్బీర్, సభ్యులు బొంగు మల్లేశం,, గుడికాడ శ్రీకాంత్, పాల్గొన్నారు