ఎన్నికల విధులు నిర్వహించే వారికి రెండు రోజులు సెలవులు మంజూరు చేయాలి

 

 

 

 

 

 

 

టేకులపల్లి,డిసెంబర్ 9(జనంసాక్షి)

* టిజిటిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో నిర్వహిస్తున్న పంచాయితీ ఎన్నికలు మూడు విడతలలలో జరుగుతుందని,ఈ మూడు విడతలలో ఎలక్షన్ డ్యూటీ పడ్డ ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని అన్నారు.మొదటి విడత ఎలక్షన్ 10,11 తేదీలలో ఎలక్షన్ డ్యూటీ చేసి వెంటనే 12 తారీకున పాఠశాల విధులకు హాజరై తిరిగి రెండో విడత ఎలక్షన్ డ్యూటీ 13,14 తేదీలలో చేసి మరునాడు 15 తారీఖున పాఠశాల విధులకు హాజరై వెంటనే మూడో విడత ఎలక్షన్ డ్యూటీ 16,17 తేదీలలో పాల్గొనడం అంటేవిరామం లేకుండా నిర్విరామంగా విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మూడు విడతలలో ఎన్నికల విధులకు విరామం లేకుండా రోజు విడిచి రోజు విధులు నిర్వహించడం ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రతి విడతకు వేరువేరు ప్రాంతాలలో విధులు నిర్వహించడం తీవ్ర ఒత్తిడికి గురి కావడం, ప్రయాణాలతో అలసిపోవడం జరుగుతుందన్నారు.
ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న ఉద్యోగ ఉపాద్యాయులు 12,15 తేదీలలో మళ్లీ పాఠశాల విధులకు హాజరవ్వడమంటే ఇబ్బందులకు గురి కావడం, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు.ఎలక్షన్ డ్యూటీ అంటేనే ఒత్తిడితో కూడుకుందని అందులో మూడు ఫేజ్ లలో డ్యూటీ పడ్డ వారి పరిస్థితి వర్ణనాతీతం అని అన్నారు. మూడు ఫేజ్ లలో ఎలక్షన్ డ్యూటీ పడ్డ ఉద్యోగ ఉపాధ్యాయులకు రెండు రోజులు అనగా 12,15 తారీకులలో సెలవు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ (టిజిటిటిఎఫ్) రాష్ట్ర శాఖ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.