గుర్తు తెలియని మృతదేహం లభ్యం

 

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):

భూపాలపల్లి శివారు చెరువులో మంగళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. భూపాలపల్లి పట్టణంలోని జవహర్ నగర్ కాలనీ శివారు బొబ్బుగడి చెరువులో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పరిశీలించినట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడా.. లేక ఎవరైనా హత్య చేసి పడేశారా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆకుపచ్చ టీషర్టు, నలుపు రంగు లోయరు, ఎరుపు కలర్ ఫుల్ డ్రాయర్, చేతికి రెండు వరుసల దేవుని దండ కలిగి ఉన్న మృతుని వయసు సుమారు 40 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉంటుందని, తెలుపు గడ్డము, తెల్లటి తల వెంట్రుకలు కలిగి ఉన్నాడని, బ్రౌన్ కలర్ సాక్సులు ధరించి ఉన్నాడని ఎవరైనా గుర్తు పడితే ఈ 8712658120, 8712658121, 8712658142 నెంబర్లకు తెలియజేయాలని
భూపాలపల్లి ఎస్సై సాంబమూర్తి కోరారు.