కాంగ్రెస్ తోనే పట్టణ ప్రగతి సాధ్యం

ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
మంథని, (జనంసాక్షి): ఈనెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి పట్టణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని ఓటర్లను మంథని ఎమ్మెల్యే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కోరారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మారుపాక నిహారిక నాగరాజు కు మద్దతుగా మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఉదయం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణ ప్రజలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, పది లక్షల ఆరోగ్యశ్రీ తో పాటు అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ అమలు చేస్తుందని తెలిపారు. పట్టణ ప్రగతి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పట్టణ ప్రాంతాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఆయన వెంట అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


